వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ ప్లేస్టోర్ నుండి యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారా? ఆ యాప్స్ తో డేంజర్; గూగుల్ అలెర్ట్!!

|
Google Oneindia TeluguNews

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎప్పుడు ఎటునుంచి ఏ విధంగా, ఎవరి మొబైల్ నుంచి, ఎవరి ల్యాప్ టాప్ ల నుంచి సైబర్ నేరగాళ్లు దాడి చేస్తున్నారో అర్థం కావడం లేదు. రోజుకో రకంగా అనేక భద్రతా తనిఖీలను తప్పించుకుని సైబర్ నేరగాళ్లు మన మొబైల్ ఫోన్ లలోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా గూగుల్ ప్లేస్టోర్ లోకి నకిలీ యాప్ లను రిలీజ్ చేస్తూ వాటిని వినియోగించిన వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

యూజర్ల భద్రతకు హాని కలిగించే యాప్స్ నిషేధించిన గూగుల్

యూజర్ల భద్రతకు హాని కలిగించే యాప్స్ నిషేధించిన గూగుల్

గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న యాప్స్ అన్ని గూగుల్ అనేక భద్రతా తనిఖీలను చేసిన తర్వాత రిలీజ్ చేసే యాప్స్ అని అందరూ భావిస్తుంటారు. అయితే గూగుల్ కూడా నిజంగానే భద్రతా తనిఖీలను చేసిన తర్వాత ప్లే స్టోర్ లోకి యాప్స్ ను రిలీజ్ చేస్తుంది.

కానీ సైబర్ నేరగాళ్ల తెలివితేటలతో గూగుల్ ప్లే స్టోర్ ను కూడా మోసం చేస్తున్నారు. అనేక భద్రతా తనిఖీలను తప్పించుకుని ప్లే స్టోర్ లో తమ యాప్స్ కనిపించేలా సైబర్ నేరగాళ్లు చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని గుర్తించిన గూగుల్ యూజర్లకు హానికలిగించే పలు యాప్ లను గుర్తించి బ్యాన్ చేసింది. ఇప్పటికే పలు యూజర్లు ఈ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకున్నట్టు గూగుల్ తెలిపింది.

గూగుల్ బ్యాన్ చేసిన యాప్స్ ఇవే

గూగుల్ బ్యాన్ చేసిన యాప్స్ ఇవే

1. స్పీడ్ రాడార్ కెమెరా
2.QR & బార్‌కోడ్ స్కానర్ (AppSource హబ్ ద్వారా డెవలప్ చేయబడింది)
3. Wi-Fi మౌస్ (రిమోట్ కంట్రోల్ PC)
4. AI-Moazin లైట్ (ప్రార్థన సమయాలు)
5. స్మార్ట్ కిట్ 360
6. సాధారణ వాతావరణం & గడియార విడ్జెట్ (డిఫెర్ ద్వారా డెవలప్ చేయబడింది)
7. హ్యాండ్‌సెంట్ తదుపరి SMS- MMSతో వచనం
8.ఖిబ్లా కంపాస్ - రంజాన్ 2022
9. పూర్తి ఖురాన్ MP3-50 భాషలు & అనువాద ఆడియో
10. Audiosdroid ఆడియో స్టూడియో DAW

యాప్స్ ద్వారా బ్యాంకింగ్ మోసాలు... వాటిని అన్ఇన్స్టాల్ చేయాలన్న గూగుల్

యాప్స్ ద్వారా బ్యాంకింగ్ మోసాలు... వాటిని అన్ఇన్స్టాల్ చేయాలన్న గూగుల్

ఇక ఈ యాప్స్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్నట్లయితే వివిధ భద్రతా కారణాల వల్ల వాటిని అన్ఇన్స్టాల్ చేయాలని గూగుల్ పేర్కొంది. గూగుల్ బ్యాన్ చేసిన యాప్ లు యూజర్ డేటాను దొంగిలిస్తున్నట్లుగా గుర్తించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఈ నిషేధిత యాప్‌లు ఇప్పటివరకు 60 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేయబడ్డాయి.

ఈ యాప్‌ల సహాయంతో హ్యాకర్లు యూజర్ల కచ్చితమైన లొకేషన్‌ను తెలుసుకోవచ్చునని కూడా నివేదిక పేర్కొంది. ఈ యాప్ ద్వారా ఇమెయిల్‌లు, ఫోన్ నంబర్లు మరియు పాస్‌వర్డ్‌లను దొంగిలించి తద్వారా బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకొని బ్యాంకింగ్ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించింది.

యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే విషయంలో కాస్త స్మార్ట్ గా ఆలోచించండి

యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే విషయంలో కాస్త స్మార్ట్ గా ఆలోచించండి

కట్ అండ్ పేస్ట్ పద్ధతిలో డేటా చోరీ జరుగుతోందని, ఇక ఈ యాప్ ద్వారా వాట్సాప్ లో వచ్చిన ఫైల్స్ ను కూడా డౌన్లోడ్ చేయొచ్చని పేర్కొంది. అందుకే తక్షణం ఈ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అన్ఇన్స్టాల్ చేయాలని గూగుల్ పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్ లో కూడా రకరకాల యాప్స్ ఉంటున్న నేపధ్యంలో ఏ యాప్ పడితే ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే ప్రమాదంలో పడతారు. అందుకే యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే విషయంలో కాస్త స్మార్ట్ గా ఆలోచించండి. తస్మాత్ జాగ్రత్త!!

English summary
Google has identified and banned 10 apps that are harmful to users. Suggested uninstalling them. It claims that cyber criminals are committing cyber scams through these apps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X