భారత 15వ, తొలి ఆదివాసిరాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము: 25న ప్రమాణం, ప్రధాని మోడీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించి భారతదేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించనున్న తొలి గిరిజన మహిళగా ఎన్‌డిఎకు చెందిన ద్రౌపది ముర్ము గురువారం చరిత్ర సృష్టించారు. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ముర్ము 50 శాతం మార్కును అధిగమించారు.

2015-2021 మధ్య జార్ఖండ్ గవర్నర్‌గా కూడా పనిచేసిన ద్రౌపది ముర్ము.. రామ్ నాథ్ కోవింద్ తర్వాత భారతదేశ 15వ రాష్ట్రపతి అవుతారు. కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది, కొత్త రాష్ట్రపతి జూలై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Droupadi Murmu Set To Be Indias 15th and first tribal woman president, Defeats Yashwant Sinha By A Landslide

లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల ఓట్ల లెక్కింపు తర్వాత ముర్ము గణనీయమైన ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత ఫలితాలు ముందస్తుగా ముగిశాయి. చెల్లుబాటు అయ్యే 748 ఓట్లలో ఆమెకు 540, యశ్వంత్ సిన్హాకు 204 వచ్చాయి. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కో ఎంపీ ఓటు విలువ 700 ఉండగా, ముర్ముకు మొత్తం 5,23,600 ఓట్లు వచ్చాయి, ఇది మొత్తం చెల్లుబాటయ్యే ఎంపీ ఓట్లలో 72.19 శాతం.

భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసి మహిళకు మద్దతుగా నిలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు కూడా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు.

రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+