బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ యుద్ధ విమానం స్పెషాలిటీ ఏంటో తెలుసా?: డీఆర్డీఓ మరో ఘనత: దేశ రక్షణ వ్యవస్థలో కీలకం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తోన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) మరో ఘనత సాధించింది. తొలి మానవ రహిత యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేసింది. ఈ రకానికి చెందిన యుద్ధ విమానాల తయారీలో ముందడుగు వేసింది. ఈ యుద్ధ విమానం ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. దీనితో- ఇలాంటి ఎయిర్‌క్రాఫ్ట్స్ ఇక మరిన్ని రక్షణ శాఖ అమ్ములపొదిలోకి రానున్నాయి.

అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌ను ఇవ్వాళ కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ తరహా యుద్ధ విమానాన్ని డీఆర్డీఓ అభివృద్ధి పర్చడం ఇదే తొలిసారి. మానవ రహిత యుద్ధ విమానం ఇది. దీన్ని నడపడానికి ఎయిర్ కమాండర్ అవసరం ఉండదు. తనంతట తానుగా టేకాఫ్ తీసుకుంటుంది. నిర్దేశిత సమయానికి, నిర్దేశిత ప్రాంతంలో ల్యాండ్ అవుతుంది.

 DRDO successfully carried out the maiden flight of an unmanned combat aircraft in Karnataka

వే పాయింట్ నేవిగేషన్ సహా వందశాతం ఖచ్చితత్వంతో ఈ ప్రయోగం విజయవంతమైంది. మానవ రహిత ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ధి దిశగా కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం.. అదే స్థాయిలో ఖచ్చితమైన పని తీరును ఈ యుద్ధ విమానం రికార్డు చేసిందని డీఆర్డీఓ వెల్లడించింది. ఈ మేరకు ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన ఓ వీడియో క్లిప్‌ను తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. డీఆర్‌డీవోకు చెందిన ప్రముఖ పరిశోధక ప్రయోగశాల ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) దీన్ని డిజైన్ చేసింది. బెంగళూరులో ఉంటుందీ ఏడీఆర్.

కాగా- ఈ మానవ రహిత యుద్ధ విమానానికి చిన్న, టర్బోఫ్యాన్ ఇంజిన్‌ను అమర్చారు. ఎయిర్‌ఫ్రేమ్, అండర్ క్యారేజ్, ఫ్లయిట్ కంట్రోల్స్, ఏవియానిక్స్ సిస్టమ్‌లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేశారు డీఆర్డీఓ శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే దీన్ని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.

English summary
The DRDO successfully carried out the maiden flight of an unmanned combat aircraft in Karnataka's Chitradurga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X