drugs case: ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు , షారూక్ ఖాన్ కు బిగ్ రిలీఫ్ !!

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ లభించింది. బొంబాయి హైకోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయడంతో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుటుంబానికి పెద్ద ఉపశమనం లభించింది. షారూక్ ఖాన్ , గౌరీ ఖాన్ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు రోజులుగా ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై బొంబాయి హైకోర్టులో విచారణ సాగుతుండగా, గురువారం మూడవరోజు కేసు విచారించిన ధర్మాసనం ఆర్యన్ ఖాన్ కు బెయిలు మంజూరు చేసింది.

బెయిల్ ఇవ్వొద్దని బలమైన వాదనలు వినిపించిన ఎన్సీబీ

బెయిల్ ఇవ్వొద్దని బలమైన వాదనలు వినిపించిన ఎన్సీబీ


ఈ రోజు కోర్టులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తరపున బలమైన వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్ మాదకద్రవ్యాల సాధారణ వినియోగదారుడని, నిత్యం డ్రగ్స్ తీసుకునే వాడని, అతని వాట్సాప్ చాట్‌లు వాణిజ్య పరిమాణంలో ఉన్నాయని, భారీగా డ్రగ్స్ కొనుగోలు చేయడాన్ని సూచిస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) బాంబే హైకోర్టులో వాదనలు వినిపించింది. సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడి బెయిల్‌ మంజూరు చెయ్యొద్దని వ్యతిరేకంగా వాదించింది.

ఆర్యన్ ఖాన్ వాణిజ్య పరిమాణంలో డ్రగ్స్ కొనుగోలు చేశాడన్న ఎన్సీబీ

ఆర్యన్ ఖాన్ వాణిజ్య పరిమాణంలో డ్రగ్స్ కొనుగోలు చేశాడన్న ఎన్సీబీ

డ్రగ్స్ నేరాలు నరహత్య కంటే దారుణం అని సుప్రీంకోర్టు పేర్కొన్నందున, అటువంటి కేసులలో బెయిల్ నేరస్తులకు మినహాయింపు కాకూడదని కూడా ఏజెన్సీ పేర్కొంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేస్తే అతను సాక్షులను ప్రభావితం చేస్తారని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ అన్నారు. అతని వాట్సప్ చాట్ లలోవాణిజ్య పరిమాణంలో డ్రగ్స్ సేకరిస్తున్నట్లు ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. అతను అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్సీబీ వాదించింది.

ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ దొరకలేదు, ఆర్యన్ ఒక బాధితుడు అన్న ఆర్యన్ న్యాయవాది

ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ దొరకలేదు, ఆర్యన్ ఒక బాధితుడు అన్న ఆర్యన్ న్యాయవాది


అయితే ఈ కేసులో ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, అతను డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా పరీక్షలు నిర్ధారించ లేదని, అతనితో కలిసి వచ్చిన వ్యక్తి వద్ద డ్రగ్స్ ఉన్నంత మాత్రాన ఆర్యన్ ఖాన్ ను ఎలా అరెస్ట్ చేస్తారని ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. క్రూయిజ్ షిప్ పార్టీకి ప్రత్యేక అతిధిగా వెళ్ళాడని, ఒకవేళ డ్రగ్స్ అలవాటు ఉన్నా యువకుడిని బాధితుడిగా చూడాలని నిందితుడిగా కాదని పేర్కొన్నారు. వాట్సాప్ చాటింగ్ ల ఆధారంగా డ్రగ్స్ ఆరోపణలు చేయడం సబబు కాదని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

 కావాలని కుట్ర పూరిత అరెస్ట్ అంటూ కోర్టు దృష్టికి.. బెయిల్ ఇచ్చిన కోర్టు

కావాలని కుట్ర పూరిత అరెస్ట్ అంటూ కోర్టు దృష్టికి.. బెయిల్ ఇచ్చిన కోర్టు

కావాలని కుట్రపూరితంగా ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేశారని, బెయిలు మంజూరు చేయాలని ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం మూడు వారాల తర్వాత ఆర్యన్ ఖాన్ కు జైలు జీవితం నుండి విముక్తి లభించనుంది. ఆర్యన్ ఖాన్ ను జైలునుండి శుక్రవారం గాని, లేదా శనివారం నాడు గాని విడుదల అయ్యే అవకాశం ఉంది.

 ఆర్యన్ ఖాన్ తో పాటు అర్బాజ్ మర్చంట్ , మున్మున్ ధమేచాలకు బెయిల్ ఇచ్చిన కోర్టు

ఆర్యన్ ఖాన్ తో పాటు అర్బాజ్ మర్చంట్ , మున్మున్ ధమేచాలకు బెయిల్ ఇచ్చిన కోర్టు

ఆర్యన్ ఖాన్ తో పాటుగా ఈ కేసులో అరెస్టయిన అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేసింది ముంబై హైకోర్టు. వీరి తరపున కూడా అమిత్ దేశాయ్ , దేశ్ ముఖ్ వాదనలు వినిపించారు.వారికి కూడా ఈ కేసులో బెయిల్ లభించింది. చాలా రోజు సుదీర్ఘ పోరాటం తర్వాత షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ లభించటంతో షారుఖ్ ఖాన్ కుటుంబానికి పెద్ద రిలీఫ్ లభించినట్లయింది. ఇంతకుముందు రెండుసార్లు ఆర్యన్ ఖాన్ కు ఎన్డీపీఎస్ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ లభించడంతో షారుక్ ఖాన్ ఇంటి వద్ద ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+