Kerala: కేరళలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ..
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ బుధవారం కేరళలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడం, నివాస, వాణిజ్య భవనాలకు నష్టం వాటిల్లింది. రానున్న మూడు నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించింది.
ఆ రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ను వివిధ శాఖల ప్రతినిధులతో, జాతీయ విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ సమన్వయం చేసుకుంటున్నట్లుముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. బుధవారం ఇడుక్కి జిల్లాకు రెడ్ అలర్ట్‌తో పాటు పతనంతిట్ట, కొట్టాయం అలప్పుజా, ఎర్నాకులం, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు మొదలయ్యాయి.

రాజధాని తిరువనంతపురం, కొల్లాం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఇడుక్కి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. పతనంతిట్ట, కొట్టాయం అలప్పుజా, ఎర్నాకులం, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
భారీ వర్షాల కారణంగా మలప్పురం జిల్లాలో 13 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పెరింతల్ మన్న వద్ద పార్క్ చేసిన వాహనాలపై కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఎర్నాకుళం, అలప్పుజా, కాసర్గోడ్ జిల్లాల్లో పాఠశాలలకు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఎర్నాకులం, అలప్పుజా జిల్లాల్లో ప్రొఫెషనల్ కాలేజీలతో పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.మణిమాల నదిపై ఉన్న కల్లుపర, పుల్లకైర్ స్టేషన్లు, పంపా నదిపై ఉన్న మడమన్ స్టేషన్, అచ్చంకోవిల్ నదిపై ఉన్న తుంబమాన్ స్టేషన్, మీనాచిల్ నదిపై కీటంగూర్ స్టేషన్లలో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది.












Click it and Unblock the Notifications