సంక్రాంతి వేళ phonepe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్. అందరికీ రూ.5వేలు..నిజమేనా!

మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయని, సైబర్ మోసాల పైన అవగాహన కలిగించడం కోసం ప్రభుత్వాలు, సైబర్ క్రైం పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా కూడా, నిత్యం ఏదో ఒక విధంగా ప్రజలు సైబర్ నేరగాళ్లను నమ్ముతున్నారు. అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు.

సంక్రాంతి వేళ పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్
ఇక తాజాగా సంక్రాంతి వేళ పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ అంటూ ఫోన్ పే పేరు మీద ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఫోన్ పే పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రాం అందరు వినియోగదారులకు 5000 రూపాయలు అంటూ ఒక లింక్ సోషల్ మీడియా గ్రూపులలో హల్చల్ చేస్తుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఫోన్ పే అందరికీ ప్రత్యేక బహుమతిని అందిస్తుందని ఆ లింకులో పేర్కొంది.

During Sankranthi is the PhonePe Pongal Grand Gift program really giving Rs 5 000 to everyone

నాకు 5000 రూపాయలు వచ్చింది లింక్.. ఓపెన్ చేస్తే జరిగేదిదే
అయితే ఇది మొదటి నకిలీ అనుకున్నాను కానీ నిజంగా నాకు 5000 రూపాయలు వచ్చింది మీరు కూడా ప్రయత్నించి చూడండి అంటూ కొందరు ఆ లింకును వివిధ వాట్సప్ గ్రూపుల ద్వారా స్ప్రెడ్ చేస్తున్నారు. నిజమే అని నమ్మిన వారు వాటిని ఓపెన్ చేస్తే 404 ERROR వస్తుంది.

ఫోన్ పే యూజర్లకు సైబర్ క్రైం పోలీసుల అలెర్ట్
అయితే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఫోన్ పే యూజర్లను టెంప్ట్ చేసేలా ఉన్న ఈ లింకు ఓపెన్ చేసి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.డబ్బులకు ఆశపడి ఫోన్లో లింకు ఓపెన్ చేసి మీ వ్యక్తిగత డేటాను సైబర్ క్రిమినల్స్ చేతికి చేర్చవద్దని, అదే గనక జరిగితే మీరు మీ బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బు పోగొట్టుకోవాల్సి వస్తుందని, ఫోన్ హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

అయాచితంగా వచ్చే వాటి కోసం ఆశ వద్దు
మీకు కూడా ఇటువంటి మెసేజ్ వస్తే పొరపాటున కూడా ఆ లింకును క్లిక్ చేయవద్దని సలహా ఇస్తున్నారు. ఇక వాట్సప్ గ్రూపులలో ఉన్న సభ్యులు ఎవరు ఇటువంటి లింకులను షేర్ చేయవద్దని అలా షేర్ చేస్తే మీరు కూడా సైబర్ క్రిమినల్స్ తో భాగస్వామ్యం తీసుకున్నట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు. అయాచితంగా వచ్చే వాటి కోసం ఆశపడి, కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు అని సైబర్ క్రైమ్ పోలీసులు సలహా ఇస్తున్నారు. కనుక సంక్రాంతి పండుగకు వైరల్ అవుతున్న ఈ లింక్ విషయంలో. తస్మాత్ జాగ్రత్త.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+