అండమాన్-నికోబార్ దీవులను వణికించిన భూకంపం: జనం పరుగులు
పోర్ట్‌బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది. దీంతో ఇళ్లలోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా, రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది.
మంగళవారం ఉదయం 8.09గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చేసుకున్నట్లు సమాచారం లేదు. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కానీ, దీనిపైనా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

కాగా, జనవరి 14న అండమాన్ దీవుల్లో 4.8తీవ్రతతో భూకంపం సంభవించింది. నెల రోజుల గడువులోనే మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications