అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం: పోర్ట్‌బ్లెయిర్‌కు 250 కి.మీల దూరంలో కేంద్రం
న్యూఢిల్లీ: అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. అయితే, ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం ఉదయం 10.31 గంటలకు ఈ భూకంపం సంభవించింది. తూర్పు పోర్ట్ బ్లెయిర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఈ భూకంప డెప్త్ 10 కిలోమీటర్లు ఉందని అధికారులు తెలిపారు.

గత కొద్ది రోజులుగా దేశంలోని పలు రాస్ట్రాల్లో భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాదితోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఓ వైపు కరోనా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంటే.. మరోవైపు ఈ భూకంపాలు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications