భూకంప బీభత్సం: నేపాల్‌లో 57, భారత్‌లో 17మంది మృతి(పిక్చర్స్)

న్యూఢిల్లీ/ఖాట్మాండ్: నేపాల్‌పై ప్రకృతి పగబట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవల సంభవించిన భారీ భూకంపానికి 8,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మళ్లీ మంగళవారం మధ్యాహ్నం మరో భూకంపం ఆ దేశాన్ని గడగడా వణికించింది. భూకంప ధాటికి కనీసం 57 మంది మరణించారని, 1,117 మంది తీవ్రంగా గాయపడ్డారని నేపాల్‌ హోంశాఖ వెల్లడించింది.

రాజధాని ఖాట్మాండ్‌కు తూర్పున 83 కి.మీ.ల దూరంలో ఎవరెస్ట్‌ పర్వతానికి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 12:35 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌ మీద 7.3గా నమోదైందని అమెరికా భూవిజ్ఞాన సంస్థ తెలిపింది. భూమిలోపల 15 కి.మీ.ల లోతులో ఈ భూకంపం వచ్చినట్లుగా పేర్కొంది. దీని ప్రభావం 32 జిల్లాలపై (నేపాల్‌లో మొత్తం జిల్లాలు 75) పడిందని.. ముఖ్యంగా దోలఖా, సింధుపాల్‌చౌక్‌ జిల్లాలపై తీవ్రంగా ఉందని నేపాల్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ రెండు జిల్లాలు ఏప్రిల్ 25న వచ్చిన భారీ భూకంపం కారణంగా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాయి. కాళ్ల కింది భూమి కదులుతుండటంతో అనేకప్రాంతాల్లో జనం భయకంపితులై ఇళ్లలోంచి బయటికొచ్చి వీధుల్లోకి పరిగెత్తారు. భూప్రకంపనల ప్రభావానికి గురైన రాజధాని ఖాట్మాండ్‌లోనూ ఇటువంటి దృశ్యాలు కనిపించాయి. నగరంలో ఆరు భవనాలు కూలిపోయాయని పోలీసులు పేర్కొన్నారు.

ఇంతకుముందు వచ్చిన భూకంపం కారణంగా అనేకమంది జనం ఇళ్లను వదిలి మైదానాల్లో, బహిరంగప్రదేశాల్లో గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు. తాజా భూకంపంతో వారంతా మరోసారి తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఇది ఇలా ఉండగా భూకంప ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు కంపించాయి. పశ్చిమబెంగాల్, బీహార్, ఢిల్లీల్లో భూకంప తీవ్రతకు పలువురు గాయపడ్డారు. ఈ భూకంప ధాటికి భారతదేశంలో మొత్తం 17మంది మరణించినట్లు తెలిసింది. ఆఫ్ఘనిస్థాన్ దేశంలో కూడా భూకంప ప్రభావం చూపింది.

ఆరుబయటే పరీక్షలు

ఆరుబయటే పరీక్షలు

భూకంప ప్రభావంతో ఆరుబయటే పరీక్షలు రాస్తున్న పశ్చిమబెంగాల్ విద్యార్థులు.

గాయపడిన విద్యార్థిని

గాయపడిన విద్యార్థిని

భూకంప ధాటికి పాఠశాల భవనం కూలిపోవడంతో గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం.

ఖాట్మాండ్‌లో..

ఖాట్మాండ్‌లో..

నేపాల్‌పై ప్రకృతి పగబట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవల సంభవించిన భారీ భూకంపానికి 8,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మళ్లీ మంగళవారం మధ్యాహ్నం మరో భూకంపం ఆ దేశాన్ని గడగడా వణికించింది.

గుర్గావ్‌లో

గుర్గావ్‌లో

భూకంప ప్రభావంతో గుర్గావ్‌లో తాము పని చేసే కంపెనీ భవనం నుంచి బయటికి వచ్చిన ఉద్యోగులు.

ఖాట్మాండ్ లో కూలిన భవనం

ఖాట్మాండ్ లో కూలిన భవనం

నేపాల్ లో తాజాగా సంభవించిన భూకంప ధాటికి కనీసం 57 మంది మరణించారని, 1,117 మంది తీవ్రంగా గాయపడ్డారని నేపాల్‌ హోంశాఖ వెల్లడించింది.

ఖాట్మాండ్ లో కూలిన భవనాలు

ఖాట్మాండ్ లో కూలిన భవనాలు

రాజధాని ఖాట్మాండ్‌కు తూర్పున 83 కి.మీ.ల దూరంలో ఎవరెస్ట్‌ పర్వతానికి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 12:35 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌ మీద 7.3గా నమోదైందని అమెరికా భూవిజ్ఞాన సంస్థ తెలిపింది.

బీహార్‌లో

బీహార్‌లో

భూకంప ప్రభావంతో బీహార్ రాష్ట్రంలోని మోతిహరి ప్రాంతంలోని ప్రజలు రోడ్లపై కూర్చున్న దృశ్యం.

ఢిల్లీలో..

ఢిల్లీలో..

భూకంప ప్రభావంతో ఢిల్లీలోని ఎస్ బిఐ భవనం నుంచి బయటికి వచ్చిన ప్రజలు, ఉద్యోగులు.

కోల్‌కతాలో..

కోల్‌కతాలో..

పశ్చిమబెంగాల్ లోని కోల్‌కతాలో భూకంప ప్రభావంతో వీధుల్లోకి వచ్చిన ప్రజలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+