బంగాళాఖాతంలో భారీ భూకంపం
Bay of Bengal earthquake: బంగాళాఖాతంలో ఉత్పాతం చోటు చేసుకుంది. పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత పొరుగునే ఉన్న అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంపై తీవ్రంగా పడింది. పలు చోట్ల భూమి ప్రకంపించింది. తీర ప్రాంతం అల్లకల్లోలానికి గురయ్యాయి. కెరటాలు ఉవ్వెత్తున ఎగిశాయి.
బంగాళాఖాతంలో తాజాగా సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల‌్‌పై 5.2గా రికార్డయింది. 8.97 ఉత్తర అక్షాంశం, 94.24 తూర్పు రేఖాంశం మధ్య ఈ మధ్యాహ్నం సరిగ్గా 3:47 నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది.

అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంలో భాగమైన పెర్కాకు దక్షిణ దిశగా 83 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించింది. సముద్ర ఉపరితలం నుంచి 61 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మాలజీ సెంటర్ వివరించింది.
దీని ప్రభావం అండమాన్ నికోబార్ ద్వీపంపై పడింది. పలు ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. అలలు పోటెత్తాయి. మత్స్యకార గ్రామాలు భయాందోళనలకు గురయ్యాయి. తొలుత- సునామీ సంభవింవచవచ్చంటూ వార్తలొచ్చాయి గానీ అలాంటి హెచ్చరికలేవీ కూడా జారీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ భూకంప తీవ్రత కోల్‌కతలో పలు ప్రాంతాల్లో కనిపించింది. పలుచోట్ల భూమి ప్రకంపించింది. పెర్కా, ఛోటా అండమాన్, ఇందిరా పాయింట్, క్యాంప్ బెల్ బే, లాఫుల్.. వంటి చోట్ల తీరం అల్లకల్లోలమైంది. కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. కెరటాలు ఎగిసిపడ్డాయి. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన సమాచారం ఇప్పటివరకు లేదు.
ఈ భూకంప తీవ్రత అటు మలేసియా, మయన్మార్ పైనా కనిపించింది. తీర ప్రాంతాల్లో అలలు పోటెత్తాయి. ముందుజాగ్రత్త చర్యగా స్థానిక అధికారులు తీర ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఫుకెట్ వద్ద అలజడి నెలకొంది. పర్యాటకులను అప్రమత్తం చేశారు. భూకంపం సంభవించిందనే సమాచారాన్ని మైక్ ద్వారా అనౌన్స్ చేశారు.
EQ of M: 5.2, On: 24/06/2025 15:47:00 IST, Lat: 8.97 N, Long: 94.24 E, Depth: 61 Km, Location: Andaman Sea.
— National Center for Seismology (@NCS_Earthquake) June 24, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/oBIsbJfOmW












Click it and Unblock the Notifications