Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సౌత్ ఆఫ్రికా ఈవీఎంలతో సౌత్ ఇండియాలో ఎన్నికలా ?, ఈసీ పక్కా క్లారిటీ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ జరిగింది. కర్ణాటకలో జరిగిన ఎన్నికలకు సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన ఈవీఎంలు ఉపయోగించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయంలో భారత ఎన్నికల అధికారి కార్యాలయం పక్కాక్లారిటీ ఇచ్చింది.

కర్ణాటకలో జరిగిన ఎన్నికలకు సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన ఈవీఎంలు ఉపయోగించారని, ఈ విషయంలో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా ఎన్నికల అధికారులకు లేఖ రాశారు. ఈవీఎం యంత్రాల విషయంలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయని రణదీప్ సింగ్ సూర్జేవాలా ఎన్నికల అధికారులకు మే 8వ తేదీన లేఖ రాశారు.

 electiocommission

కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై భారత ఎన్నికల కమీషన్ అధికారులు వివరణ ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం తాము దక్షిణ ఆఫ్రికా నుంచి ఈవీఎం యంత్రాలు తీసుకురాలేదని ఈసీ అధికారులు స్పష్టం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తయారు చేసిన ఈవీఎం యంత్రాలను ఉపయోగించామని భారత ఎన్నికల అధికారులు వివరణ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎం యాంత్రాల్లో కౌంటింగ్ తో పాటు రీ కౌంటింగ్, మరు పరిశీలన చేసే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు వివరణ ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం దక్షిణ ఆఫ్రికా నుంచి ఈవీఎం యంత్రాలు తెచ్చామని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను భారత ఎన్నికల కమీషన్ ఖండించింది.

 evm-1

అసలు దక్షిణ ఆఫ్రికాలో ఎన్నికల కోసం ఈవీఎం యంత్రాలు ఉపయోగించరని, ఆ విషయాన్ని దక్షిణ ఆఫ్రికా ఎన్నికల కమీషన్ అధికారిక వెబ్ సైట్లో పరిశీలించుకునే అవకాశం ఉందని, వెనుకా ముందు ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని భారత ఎన్నికల కమీషన్ అంటోంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎం యంత్రాలను దక్షిణ ఆఫ్రికాకు తిరిగి పంపిస్తామని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజంలేదని ఎన్నికల అధికారులు అంటున్నారు. ఈవీఎం యంత్రాల విషయంలో ఓ రాజకీయ పార్టీ చేసిన ఆరోపణలకు భారత ఎన్నికల కమీషన్ వివరణ ఇవ్వడం మా బాధ్యతగా బావించామని ఈసీ స్పష్టం చేసింది. మొత్తం మీద ఈవీఎం యంత్రాలతో గుడ్డిగా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు కంగుతిన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+