ఈసీ అనూహ్య నిర్ణయం: నాలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు నో - ఎందుకంటే..
బీహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికలతోపాటే దేశంలో ఖాళీగా ఉన్న అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చేసిన ప్రకటనకు విరుద్ధంగా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ.. నాలుగు రాష్ట్రాల్లో మాత్రం పోల్స్ నిర్వహణకు నో చెప్పడంచర్చనీయాంశమైంది.
ఎన్నికల సంఘం వివరాల ప్రకారం ప్రస్తుతానికి మూడు లోక్ సభ స్థానాలు(బీహార్ లోని వాల్మికి నగర్, తమిళనాడులోని కన్యాకుమారి, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి) ఖాళీగా ఉన్నాయి. దేశం మొత్తం కలిపి 64 అసెంబ్లీ సీట్లలో ఉపఎన్నిక జరగాల్సి ఉంది. కానీ ఒక లోక్ సభ, 56 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఈసీ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.

అస్సాం, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు మాత్రం ఉప ఎన్నికలు జరుపబోమని, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ఎన్నికల నిర్వహణ కష్టంతో కూడుకున్న వ్యవహారమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం గమనార్హం. ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాల నుంచి వచ్చిన నివేదికల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రస్తుతానికి మిగతా రాష్ట్రాల్లోని 56 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.
నవంబర్ 3న తెలంగాణలోని దుబ్బాక సహా ఛత్తీస్ గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ లోని 54 సీట్లకు బైపోల్ జరుగుతుందని, నవంబర్ 7న మణిపూర్ లోని రెండు అసెంబ్లీ, బీహార్ లోని ఒక లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక ఉంటుందని ఈసీ తెలిపింది. షెడ్యూల్ ప్రకటనతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియామావళి నేటి నుంచే అమలులోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది. నాలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎన్నికలు నిర్వహించకపోవడంపై పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications