ఈసీ ట్విస్ట్ తో సుప్రీం విచారణలో కీలక పరిణామం..! చివరికి ఇలా..!

కేంద్ర ఎన్నికల సంఘంలో (ECI) ఎస్ఐఆర్ సందర్భంగా తలెత్తిన విభేదాలు, ఫామ్ 6లో చేసిన మార్పుల నేపథ్యంలో విపక్షాలతో పాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ సమర్పించిన అఫిడవిట్ కీలకంగా మారింది. ఇందులో గతంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయటపెట్టిన అంశాల్ని కొట్టిపారేసిన ఈసీ.. వాటిపై వివరణలు ఇవ్వకుండా తప్పించుకుంది. దీంతో సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.

12 విపక్ష పార్టీలతో పాటు రాకేష్ సింగ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రే ఎన్నికల కమిషన్ హడావిడిగా సుప్రీంకోర్టులో తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో ఎన్నికల కమిషనర్లకూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ కూ మధ్య విభేదాలు లేవని, ఎస్ఐఆర్ కు సంబంధించి తాము తీసుకున్న నిర్ణయాలు అన్నీ ఏకగ్రీవమే అని తేల్చేసింది. వీటిపై ఎన్నికల కమిషనర్లు లేవెనెత్తిన అంశాలు అభ్యంతరాలు కాదని, వాటిని తాము ఎక్కడా బయటపెట్టలేదని కూడా తెలిపింది. తద్వారా వీటిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించింది. అలాగే ఎన్నికల కమిషనర్లు, సీఈసీ విడివిడిగా సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా ఈసీఐ తరఫున లాయర్ ఒక అఫిడవిట్ మాత్రమే దాఖలు చేశారు. దీంతో పాటు ఫామ్ 6 విషయంలోనూ తాము ఎలాంటి మార్పులు చేయలేదని, కేవలం ఒక డిక్లరేషన్ ను విడిగా కలిపామని తెలిపింది.

ECI Functioning Row Supreme Court Defers Hearing After Petitioners Seek Time to File Rejoinder

అయితే ఇవాళ విచారణ ఉండగా నిన్న రాత్రి ఈసీ తమ అఫిడవిట్ దాఖలు చేయడంతో, దాన్ని పరిశీలించి తమ స్పందన తెలియజేయడానికి పిటిషనర్ రాకేష్ సింగ్ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో సుప్రీంకోర్టు ఈ వివరణ తీసుకోకుండా ముందుకెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే విచారణను మరో తేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు తదుపరి విచారణ కల్లా పిటిషనర్లు ఈసీ అఫిడవిట్ పై తమ స్పందనలు తెలియజేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇవాళ సుప్రీంకోర్టు ఈసీ విషయంలో తీర్పు ప్రకటించాల్సి ఉండగా.. మొత్తం వ్యవహారం వాయిదా పడిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+