సంబరాల వేళ.. డీకేపై ఈడీ మళ్లీ పంజా - తమ్ముడినీ వదల్లేదు..!!
బెంగళూరు: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ప్రవేశించిన వేళ.. అక్కడి రాజకీయాల్లో మళ్లీ కలకలం చెలరేగింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ సాగిస్తోన్న పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని, పార్టీ బలోపేతమౌతోందంటూ సంబరాలు చేసుకుంటోన్న కర్ణాటక కాంగ్రెస్ నాయకులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్‌కు ఈడీ అధికారులు తాజాగా సమన్లు జారీ చేశారు. డీకేతో పాటు ఆయన సోదరుడు, కాంగ్రెస్‌కు చెందిన బెంగళూరు రూరల్ లోక్‌సభ సభ్యుడు డీకే సురేష్‌కూ సమన్లు అందాయి. ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించాయి. నేషనల్ హెరాల్డ్ కార్యకలాపాలు, అందులో భాగంగా యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు నిధులను సమకూర్చినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ చోటు చేసుకున్నట్లు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ అధికారులు ఇదివరకే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాాంధీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. మల్లికార్జున ఖర్గె కూడా విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్, ఆయన సోదరుడికి మరోసారి ఈడీ అధికారులు సమన్లను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్‌ను ఇదివరకే ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19న ఢిల్లీలో ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇది రెండోసారి. తనకు చెందిన ఓ ట్రస్ట్ నుంచి యంగ్ ఇండి












Click it and Unblock the Notifications