Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆన్ లైన్ బెట్టింగ్ దందా, బాలీవుడ్ టాప్ హీరో రణబీర్ కపూర్ కు ఈడీ నోటీసులు, సార్ రండి !

ముంబాయి/న్యూఢిల్లీ: మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరుకావాలని హీరో రణబీర్ కపూర్ కు (ranbir kapoor) ఈడీ అధికారులు సూచించినట్లు సమాచారం. తాజాగా మహదేవ్ ఆన్ లైన్ (online) బెట్టింగ్ యాప్ కేసును విచారించిన అధికారులు రూ. 417 కోట్ల అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు.

బెట్టింగ్ యాప్ పేరుతో జరుగుతున్న భారీ మోసాన్ని ఈడీ బట్టబయలు చేసింది. రణబీర్ కపూర్ (Hero) ఆన్‌లైన్ బెట్టింగ్ (online) యాప్ మహదేవ్‌ను ప్రమోట్ చేస్తున్నాడని ఈడీ అధికారులు ( ED) తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసేందుకు (Bollywood) హీరో రణబీర్ కపూర్ (ranbir kapoor) భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ యాప్‌పై ఈడీతో పాటు పలు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ED issued notices to Bollywood hero Ranbir Kapoor in online betting app case

సౌరభ్ చంద్రఖర్, రవి ఉప్పల్ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు. వీరిద్దరూ మహాదేవ్ బెట్టింగ్ (online) యాప్ ప్రమోటర్లు. మహదేవ దుబాయ్ కేంద్రంగా భారతదేశంలో (Bollywood)బెట్టింగ్ యాప్ కార్యకలాపాలను నడుపుతున్నాడు. అయితే బెట్టింగ్‌ పేరుతో అక్రమ నగదు బదిలీని ఈడీ అధికారులు గుర్తించారుచారు. బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బదిలీ చేసేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ విచారణలో వెల్లడైంది.

ఈ ఆన్ లైన్ నెట్‌వర్క్‌తో (online) ముడిపడి ఉన్న కోల్‌కతా, భోపాల్, ముంబాయి (Mumbai) వంటి నగరాలపై ఈడీ అధికారులు దాడులు చేసి భారీ మొత్తాలను స్వాధీనం చేసుకున్నారు. మహదేవ్ బెట్టింగ్ (online) యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీఖాన్, అలీ అజ్గర్, విశాల్ దద్లానీ, (Bollywood)టైగర్ ష్రాఫ్, నేహా కక్కర్, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, సన్నీలియోన్, భాగ్యశ్రీ, పుల్కిత్, కీర్తి ఖబండా, నుష్రత్ భరుచా, కృష్ణ అభిషేక్ వంటి బాలీవుడ్ ప్రముఖులు పెళ్లిలో పాల్గొంటున్నట్లు తెలిసింది. సౌరభ్ చంద్రకర్ వివాహానికి హాజరైన ప్రముఖులపై ఈడీ (ED) దృష్టి సారించింది. ఈ కారణంగా నటుడు రణబీర్ కపూర్‌కు (ranbir kapoor) నోటీసులు జారీ అయ్యాయి.

ED issued notices to Bollywood hero Ranbir Kapoor in online betting app case

త్వరలో 17 మంది ఆర్టిస్టులకు ఈడీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశమైంది. సినిమాల్లో బిజీగా ఉంటున్న బాలీవుడ్ (Bollywood)నటుడు రణబీర్ కపూర్ (ranbir kapoor)నటించిన యానిమల్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా మెరిసింది.

రణబీర్ కపూర్ (ranbir kapoor) రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణ పద్యాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో (Bollywood) ఓ గ్రాండ్ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఆన్ లైన్ గేమింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఇప్పుడు ఈడీ ఉచ్చులో చిక్కుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+