ఛత్తీస్ ఘడ్ సీఎం బఘేల్ కు బెట్టింగ్ యాప్ నుంచి రూ.508 కోట్లు ? రంగంలోకి ఈడీ..
ఛత్తీస్ ఘడ్ లో తొలి విడత ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇవాళ గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రూ.508 కోట్ల ఎన్నికల నిధుల వసూళ్ల ఆరోపణల్లో చిక్కుకున్నారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి ముఖ్యమంత్రి బఘేల్ కు రూ.508 కోట్లు అందినట్లు ఓ కొరియర్ చేసిన ఆరోపణతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో రూ.5 కోట్లతో మధ్యవర్తి దొరికినట్లు ఈడీ ప్రకటించింది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్ల చెల్లింపులు చేశారని ంరూ.5 కోట్లకు పైగా నగదుతో పట్టుబడిన కొరియర్ ఏజెన్సీకి చెప్పిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. తన వద్ద ఉన్న డబ్బును ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ఖర్చుల కోసం ఒక రాజకీయ నాయకుడు బఘేల్ కి డెలివరీ చేయడానికి పంపినట్లు అతను ఈడీకి తెలిపాడు. రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఈ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలకు ముందు మహాదేవ్ యాప్ ప్రమోటర్ల ద్వారా పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నట్లు ఈడీకి ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ అందింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ.. కొరియర్ ను 5 కోట్ల రూపాయలతో పట్టుకున్నట్లు ప్రకటించింది. నిన్న ఈడీ హోటల్ ట్రిటాన్, భిలాయ్‌లోని మరొక ప్రదేశంలో సోదాలు నిర్వహించింది. ఇందులో కొరియర్ ను పట్టుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం పెద్ద మొత్తంలో నగదును డెలివరీ చేయడానికి యూఏఈ నుంచి పంపిన అసిమ్ దాస్ ను ఈ కొరియర్ గా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది.
దాస్ కారు, నివాసం నుండి రూ. 5.39 కోట్లు రికవరీ చేశామని, యుఎఇలో ఉన్న మహాదేవ్ యాప్ ప్రమోటర్లు ఆ డబ్బును ఒక రాజకీయ నాయకుడు బఘేల్'కి ఇవ్వడానికి ఏర్పాటు చేసినట్లు అతను అంగీకరించాడని ఈడీ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల ఖర్చులకు ఈ మొత్తం వాడబోతున్నట్లు కూడా తెలిపాడు. ఈడీ విచారణలో బెట్టింగ్ యాప్‌తో అనుసంధానించబడిన కొన్ని బినామీ బ్యాంకు ఖాతాలు కూడా కనుగొన్నారు. వాటిలో రూ.15.59 కోట్లు సీజ్ చేశారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications