Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలీవుడ్ సెలబ్రిటీలు టైగర్ ష్రాఫ్, సన్నీలియోన్, నేహా కక్కర్ లకు ఈడీ షాక్!!

మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ స్కాం కేసులో బాలీవుడ్‌ సెలబ్రిటీలకు ఈడీ షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. ఫిబ్రవరిలో యూఏఈలో రస్‌అల్‌ఖైమాలో జరిగిన మహదేవ్ బుక్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహానికి పలువురు నటులు, గాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలో స్కాంతో సంబంధముందన్న ఆరోపణలతో నలుగురు సెలబ్రిటీస్ కి సమన్లు జారీ చేయడానికి ఈడి సిద్ధమైంది.

మహదేవ్ ఆన్లైన్ బుక్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ అయిన సౌరబ్ చంద్రకర్ తన పెళ్లి కోసం 200 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఆయన తన వివాహాన్ని దుబాయ్ లో చాలా ఘనంగా చేసుకున్నాడు. ఈ పెళ్లిలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీస్ పాల్గొన్నారు. మొత్తం బాలీవుడ్ కు చెందిన 17 మందికి ఈ స్కాం తో సంబంధం ఉందని ఈడీ భావిస్తుంది. ఈ క్రమంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది.

ED shock for Bollywood celebrities Tiger Shroff, Sunny Leone, Neha Kakkar and Nushrratt Bharuccha!!

మహదేవ్ గ్యాంబ్లింగ్ యాప్ కింగ్ పిన్ సౌరభ చంద్రకర్ పెళ్లికి హాజరైన పలువురికి మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ స్కాం తో సంబంధాలు ఉన్నాయని భావించిన ఈడీ టైగర్ ష్రాఫ్, సన్నీలియోన్, నేహా కక్కర్, నుష్రత్ భరుచ్చా తదితరులకు సమన్లు పంపడానికి సిద్ధమైందని సమాచారం.

గత సంవత్సరం డిసెంబర్‌లో మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్‌పై విచారణ ప్రారంభం కాగా, బాలీవుడ్ కనెక్షన్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. దుబాయ్ నుండి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్ ని నడుపుతున్న సౌరబ్ చంద్రకర్ మరియు అతని వ్యాపార భాగస్వామి అయిన రవి ఉప్పల్ పై ఐదువేల కోట్ల మనీలాండరింగ్ కేసు ఉంది.

ఈడి దర్యాప్తు చేస్తున్న క్రమంలో బాలీవుడ్ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇదిలా ఉంటే ముంబై, భోపాల్ మరియు కలకత్తాలో ఈ కేసుకు సంబంధించిన 417 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు సంబంధించి బాలీవుడ్ ప్రముఖులు ప్రకటనలు చేశారు. ఇక వారి పేర్లను అధికారికంగా ఈడీ అధికారులు బహిర్గతం చెయ్యలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+