ఏం పనిరా ఇదీ, కిస్ చేస్తుండగా వీడియో, ఇద్దరికీ వేధింపులు, ఆపై వీడియో పోస్ట్

మైనర్ల మనసులో కూడా క్రూరమైన ఆలోచనలు.. అవును వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం.. లైంగికంగా వేధించడం.. అయితే అందులో ఒకడు బాలికతో సంబంధం కూడా ఉందట.. అయినప్పటికీ ముద్దు పెట్టుకునే వీడియో తీసి.. తర్వాత బ్లాక్ మెయిల్ చేశారు. ఇద్దరు విద్యార్థినిలకు 8 మంది స్టూడెంట్స్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డరట.. అయినప్పటికీ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడంతో.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏం పనిరా ఇదీ..

ఏం పనిరా ఇదీ..

మంగళూరులో గల సెయింట్ అలోసియస్ కాలేజీకి చెందిన 8 మంది విద్యార్థులు ఈ పని చేశారు. ఫిబ్రవరిలో లైట్ హౌస్ హిల్ రోడ్ సమీపంలో గల అపార్ట్ మెంట్‌కు వీరితో ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. వారిలో ఒకమ్మాయి, అబ్బాయి రిలేషన్ షిప్‌లో ఉన్నారు. అయితే అక్కడ వారిద్దరూ ట్రూత్ ఆర్ గేమ్ ఆడారు. ముద్దుల్లో మునిగితేలారు.

అక్కడున్న వారు వీడియో తీశారు. తర్వాత వారి నైజం బయటపడింది. అవును ఆ వీడియో చూపి.. ఇద్దరు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేశారు. లైంగిక కూడా వేధించారు. అయినప్పటికీ 17 ఏళ్ల యువకుడు ఒకడు వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఇంకేముంది వైరల్ అయ్యింది. యువతికి తెలిసి.. చివరకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించగా.. డొంక కదిలింది.

కిస్ చేసుకుంటుండగా వీడియో..

కిస్ చేసుకుంటుండగా వీడియో..

వీడియోలు వారు యూనిఫామ్‌లో ఉండటం విశేషం. ముద్దు పెట్టుకుంటుండగా.. స్నేహితులు ఎంకరేజ్ చేశారు. తర్వాతే వారికి వేధింపులు వచ్చాయి. 8 మంది లైంగికంగా హరాస్ చేశారు. అయినప్పటికీ వారు మిన్నకుండిపోయారు. కానీ వీడియో పోస్ట్ చేయడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీల్లో జరిగే అంశాలను యాజమాన్యాలు గమనించాలని పోలీస్ కమిషనర్ శశికుమార్ స్పష్టంచేశారు. విద్యార్థులపై కన్నేసి ఉంచాలని చెప్పారు. లేదంటే ఇలా రెచ్చిపోతారని చెప్పారు.

పోక్సో చట్టం కింద కేసు

పోక్సో చట్టం కింద కేసు

ఆ 8 మంది విద్యార్థులను జువైనల్ జస్టిస్ ఎదుట హాజరుపరచి.. జువైనల్ హోంకు తరలించారు. వారిపై ఫోక్సో, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విషయం తెలిసినా కాలేజీ యాజమాన్యం విషయం తమ దృష్టికి తీసుకురాలేదని పోలీసులు అంటున్నారు. చివరికీ బాలిక ఫిర్యాదు చేయడంతోనే వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+