ఎంతంటే అంత కుదురదు, రూ. కోట్లు సీజ్, ఆంధ్రా, తెలంగాణ నుంచి !

బెంగళూరు/బళ్లారి: ఎప్పుడంటే అప్పుడు లక్షల్లో, కోట్లలో డబ్బులు తీసుకుని వెళ్లేవాళ్లకు అధికారులు షాక్ ఇచ్చారు. ఎక్కడికంటే అక్కడికి డబ్బులు తీసుకెళ్లే వాళ్లు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది ?, ఎందుకు ఆ డబ్బులు తీసుకెలుతున్నారు ?, ఆ డబ్బు ఏం చెయ్యాలని అనుకుంటున్నారు ? అని పూర్తి పత్రాలు ఉండాలని అధికారులు సూచించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున లక్షల్లో డబ్బులు తీసుకెళ్లడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. మీరు డబ్బులు తీసుకెళ్లాలని అనుకుంటే కచ్చితంగా సంబంధిత పత్రాలు మీ దగ్గర ఉండాలని ఎన్నికల అధికారులు సూచించారు.

Election Commission

మే 10వ తేదీన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ జరగనుంది. ఆ రోజు వరకు డబ్బులు తరలించే విషయంలో ఎన్నికల నియమాలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. రూ. 10 లక్షల కంటే ఎక్కువ డబ్బులు తరలిస్తుంటే ఎన్నికల అధికారులు, పోలీసులు ఆ డబ్బు స్వాధీనం చేసుకోనున్నారు.

రూ. 10 లక్షల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. ఎక్కడికి తరలిస్తున్నారు అని కచ్చితంగా అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంది. అధికారులకు కచ్చితమైన పత్రాలు చూపించిన తరువాత ఆడబ్బు తీసుకెళ్లడానికి అధికారులు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంది. అలా చెయ్యకపోతే ఆ డబ్బు ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు.

Election Commission

ఆసుపత్రులు, శుభకార్యాలయాలకు డబ్బులు తీసుకెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కర్ణాటకలో అధిక మొత్తంలో డబ్బులు తరలించడానికి అవకాశం లేదు. కేవలం రూ. 50 వేల లోపు డబ్బులు (క్యాష్) తరలించడానికి ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేశారు.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రాల నుంచి వ్యాపారులు కర్ణాటకకు డబ్బు తరలించే వాళ్లు జాగ్రత్తగా ఉంటే వాళ్లకే మంచిది అని అధికారులు అంటున్నారు. డబ్బుతో పాటు భారీ మొత్తంలో బంగారు నగలు తరలించడం కూడా నేరం అని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+