Haryana Polls: హర్యానాలో 10 వేలకు పైగా 100 ఏళ్ల వృద్ధ ఓటర్లు-ఈసీ షాక్..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పాటే ఎన్నికల నిర్వహణకు వీలుగా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఓటర్ల జాబితా సిద్ధం చేయడంతో పాటు సాధ్యమైనంత ఎక్కువ మందితో ఓటు వేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఈసారి ఓటు వేయబోయే ఓటర్లలో 10 వేలకు పైగా వందేళ్లు దాటిన వృద్ధులు ఉన్నారు. దీంతో ఈసీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
హర్యానాలో 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య ఆ రాష్ట్రానికి పొరుగునే ఉన్న పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌ల కంటే ఎక్కువగా ఉన్నట్లు ఈసీ గుర్తించింది. దీంతో ఎన్నికల అధికారులు ఇప్పుడు బూత్ స్థాయిలో డేటాను నిర్ధారించేందుకు అధికారులను పంపుతున్నారు. హర్యానాలో అక్టోబర్ 1న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రాష్ట్రంలోని 9,554 మంది ఓటర్లు 100 ఏళ్లు పైబడిన వారని హర్యానా ముఖ్య ఎన్నిక అధికారి పంకజ్ అగర్వాల్ తెలిపారు.

దీంతో అనుమానం వచ్చి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో ఆరా తీశారు. ఇందులో పంజాబ్‌లో 4,116 మంది వందేళ్లు పైబడిన ఓటర్లు ఉన్నారని, హిమాచల్ ప్రదేశ్‌లో 1,216 మంది ఉన్నారని తేలింది. దీంతో ఈసీ సందేహాలు వ్యక్తం చేస్తూ తదుపరి విచారణకు ఆదేశించింది. శతాధిక వృద్ధుల డేటాను తిరిగి నిర్ధారించాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సంఖ్య అసాధారణంగా ఉన్నట్లు తేల్చారు. వీరి సంఖ్యపై ఈసీ సంతృప్తి చెందలేదని, అందువల్ల బూత్ స్థాయి అధికారుల సహాయంతో ధృవీకరణ చేయాల్సి ఉందన్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications