కాంగ్రెస్ సారథి ఎన్నికకు ముహూర్తం ఖరార్: షెడ్యూల్ ఇదే: తెరపై టీ సుబ్బరామిరెడ్డి
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడు రాబోతోన్నాడు. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ త్వరలో ప్రారంభం కాబోతోంది. సుదీర్ఘ విరామం తరువాత కాంగ్రెస్‌కు తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడు అధ్యక్ష పదవిని అందుకోబోతోండటం ఖాయమైంది. సోనియా గాంధీకి ఆరోగ్య సహకరించకపోవడం, ఆమె స్థానంలో సారథ్య బాధ్యతలను చేపట్టడానికి రాహుల్ గాంధీ అంగీకరించకపోవడం వంటి పరిణామాల మధ్య గాంధీయేతర కుటుంబ నాయకుల చేతికి కాంగ్రెస్ వెళ్లనుంది.

తాత్కాలిక అధినేత్రిగా సోనియా గాంధీ..
ఏఐసీసీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలు కావడానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకొన్నారు. ఆ తరువాత తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా నియమితులయ్యారు. మళ్లీ అవకాశం వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో పగ్గాలను అందుకోవడానికి రాహుల్ గాంధీ సుముఖత వ్యక్తం చేయలేదు. ఓ సాధారణ కార్యకర్తగా కొనసాగుతానంటూ స్పష్టం చేశారు.

కాంగ్రెసేతర కుటుంబానికి..
దీనితో కాంగ్రెస్ పగ్గాలను గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడు అందుకోబోతోండటం ఇక లాంఛనప్రాయమే. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను చేపట్టడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు వర్చువల్ విధానంలో భేటీ కొనసాగింది. సీడబ్ల్యూసీ సభ్యులందరూ దీనికి హాజరయ్యారు. సోనియా గాంధీ దీనికి అధ్యక్షత వహించారు. హెల్ చెకప్ కోసం రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో విదేశాలకు వెళ్లిన సోనియా గాంధీ.. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో ఇందులో పాల్గొన్నారు.

అమెరికా నుంచి..
హెల్త్ చెకప్ కోసం సోనియా గాంధీ అమెరికా వెళ్లారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆమె వెంటే ఉన్నారు. ఈ ముగ్గురూ ఈ వర్చువల్ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి నిర్వహించ దలిచిన ఎన్నికల షెడ్యూల్‌ను ఈ సీడబ్ల్యూసీ భేటీలో ఖరారు చేశారు. అక్టోబర్ 17వ తేదీన ఎన్నికను నిర్వహించాలని నిర్ణయించారు. 19వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీనికి సంబంధించిన ఓ తీర్మానాన్ని సీడబ్ల్యూసీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

సుబ్బరామిరెడ్డి సహా..
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు భూపేష్ బఘెల్, అశోక్ గెహ్లాట్ కేహెచ్ మునియప్ప, ఆనంద్ శర్మ పాల్గొన్నారు. ఏపీ నుంచి సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు టీ సుబ్బిరామి రెడ్డి, రాజీవ్ శుక్లా, మీరా కుమార్, అజయ్ కుమార్ లల్లు, హెచ్ కే పాటిల్, దీపేందర్ హుడా, ఊమెన్ చాందీ, జితేంద్ర సింగ్ అల్వార్, పవన్ కుమార్ బన్సల్, కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, అంబికా సోని, పీ చిదంబరం, ప్రమోద్ తివారీ, రఘువీర్ సింగ్ మీనా, పీఎల్ పునియా, శక్తిసింహ్ గోహిల్, తారిక్ అన్వర్ సహా సీడబ్ల్యూసీ సభ్యులందరూ ఈ భేటీలో పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను వినిపించారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications