Election results 2024: నటి రాధిక ఎంపీగా గెలవాలని భర్త శరత్ కుమార్ పొర్లుదండాలు
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఎన్నికల కౌంటింగ్ కు మరికొన్ని గంటల సమయం ఉంది. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల టెన్షన్ పీక్స్ కు చేరుకుంది. రేపు ఎన్నికల ఫలితాలలో ఏం జరుగుతుంది? విజయం సాధిస్తామా లేక ఓటమిపాలవుతామా? అన్నది ప్రతి ఒక్కరి మనసులను ఆందోళనకు గురిచేస్తుంది.
ఎంపీగా భార్య గెలవాలని భర్త పొర్లు దండాలు
ఇక కొందరు ఫలితాలు వెలువడుతున్న వేళ దేవుళ్ళకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దైవదర్శనాలలో మునిగిపోతున్నారు. దేవుడా ఈ ఒక్కసారి గండం గట్టెక్కించు అంటూ దేవుడిని ప్రాధేయపడుతున్నారు. సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈసారి ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసిన తన భార్య రాధిక గెలవాలని దేవుళ్లకు పూజలు చేయటమే కాదు ఏకంగా పొర్లుదండాలు పెడుతున్నారు.

శరత్ కుమార్ పొర్లు దండాలు పెడుతున్న వీడియో వైరల్
ప్రస్తుతం ఆయన పొర్లుదండాలు పెడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో నిన్న రాత్రి రాధిక శరత్ కుమార్ దంపతులు తమిళనాడులోని విరుధ్ నగర్ లోని శ్రీ పరాశక్తి మారియమ్మన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పరాశక్తి ఆలయ ప్రాంగణంలో శరత్ కుమార్ పొర్లుదండాలు పెట్టారు.
Actor Sarathkumar visited the Sri Parasakthi Mariamman temple in Virudhunagar to pray for his wife and NDA candidate Radhika's success, as the counting of votes will be held on June 4.#actor #sarathkumar #visited #srioarasakthitemplE #wifesuccess @radhikasarath pic.twitter.com/eLJ5KbXEB8
— Pradeep (@PRADEEPDEE2) June 3, 2024
రాధిక కోసం శరత్ కుమార్ ఇలా
ఎన్నికలలో పోటీ చేసిన భార్య రాధిక గెలవాలని పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన శరత్ కుమార్ మరికొన్ని గంటల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో భార్య గెలవాలని పొర్లు దండాలు పెట్టడం తమిళనాడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. 2006లో సినీనటి రాధిక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి రాజకీయంగా పెద్దగా రాణించలేదు.

ఎంపీగా రాధికకు అవకాశం .. సక్సెస్ కావాలని భర్త మొక్కులు
మొదట భర్త శరత్ కుమార్ తో కలిసి అన్నా డిఎంకె పార్టీలో చేరిన రాధిక శరత్ కుమార్ ను తర్వాత ఏడాది కాలంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అన్నా డీఎంకే అధిష్టానం వారిని పార్టీ నుంచి తొలగించింది. ఇక ఈ క్రమంలో ప్రస్తుతం తమిళనాడులో విరుధ్ నగర్ స్థానం నుంచి బిజెపి తరఫున రాధిక పోటీ చేశారు. ఇక రాజకీయాల్లో రాణించటానికి వచ్చిన తొలి అవకాశం సక్సెస్ కావాలని కోరుకుంటూ భార్య కోసం భర్త శరత్ కుమార్ పొర్లుదండాలు పెట్టారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications