Elon Musk కొత్త పార్టీ ప్రకటనతో ట్రంప్ షాక్, అమెరికా రాజకీయాల్లో సెన్సేషన్!

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నంత పనిచేశాడు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఎలాన్ మస్క్ కు మధ్య వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. మస్క్ మొదటి నుంచి ఆ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ కు వ్యతిరేకంగా మారిన మస్క్ ట్రంప్ ప్రభుత్వం ఆ బిల్లును అమలులోకి తీసుకువస్తే , కొత్త పార్టీ ప్రారంభిస్తానని గతంలోనే చెప్పారు.

అన్నంత పని చేసిన మస్క్
ఇక ప్రస్తుతం అన్నంత పని చేసి ఈ మేరకు కొత్త పార్టీ పేరును కూడా ప్రకటించాడు ఎలాన్ మస్క్. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని పేర్కొన్న మస్క్ ది అమెరికా పార్టీ స్థాపిస్తునట్లు పేర్కొన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వడం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎలాన్ మస్క్ తెలిపారు. గతంలో ఎక్స్ వేదికగా కూడా మస్క్ పార్టీ పెట్టే అంశం పైన ఓటింగ్ నిర్వహించారు.

Elon Musk announces new party Shock to Trump sensation in American politics

Take a Poll

ది అమెరికా పార్టీని ప్రకటించి ఎవరూ ఊహించని షాక్
ఆసక్తికరంగా 80శాతం మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ క్రమంలో అప్పట్లోనే ది అమెరికా పార్టీ అంటూ ఆయన చేసిన పోస్ట్ చర్చనీయాంశం అయింది. ఇక తాజాగా డోనాల్డ్ ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను చట్టంగా తీసుకు రావడానికి నిన్న సంతకం చేయడంతో దానిని మొదటినుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన ఎలాన్ మస్క్ ది అమెరికా పార్టీని ప్రకటించి అమెరికా రాజకీయాలలో ఎవరు ఊహించని షాక్ ఇచ్చారు.

అమెరికాలో కొత్త చరిత్రను సృష్టించడానికి రెడీ అవుతున్న మస్క్
తాను అనుకున్నది సాధించేవరకు వదలనని చెప్పే మస్క్ ఇప్పుడు అమెరికాలో కొత్త చరిత్రను సృష్టించడానికి రెడీ అవుతున్నారు. గతంలో ఎక్స్ లో తన రాజకీయ పార్టీపై ఓటింగ్ నిర్వహించిన సమయంలోనే ఎలాన్ మస్క్ ఆసక్తికర ప్రకటన చేశారు. అమెరికాలో 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీ అవసరమని మస్క్ తెలిపారు. ఇది ప్రధాన పార్టీలైన డెమొక్రటిక్, రిపబ్లికన్ లకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మస్క్ అభివర్ణించారు.

ట్రంప్ మస్క్ పార్టీ విషయంలో ఏం చేయబోతున్నాడు?
కొత్త పార్టీ సహాయంతో 2026 మధ్యంతర ఎన్నికలలో హౌస్, సెనేట్ సీట్ల పైన దృష్టి సారించే అవకాశం ఉంది. తదుపరి అధ్యక్ష ఎన్నికలలో మస్క్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అమెరికా రాజకీయాలలో డెమొక్రటిక్, రిపబ్లికన్ లకు ప్రత్యామ్నాయంగా మస్క్ అమెరికా పార్టీ రాజకీయాలలో నిలబడుతుందా? భవిష్యత్తులో ఏం చేయబోతుంది? ట్రంప్ మస్క్ పార్టీ విషయంలో ఏం చేయబోతున్నాడు? అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+