నిలిచిన రైలు: ముందుకు నెట్టి ఇంజన్ స్టార్ట్ చేశారు
గ్వాలియర్: వేగంగా వెళుతున్న రైలు ఒక్క సారిగా నిలిచిపోయిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. అయితే ప్రయాణికులు రైల్వే అధికారులు, సిబ్బంది కోసం ఎదురు చూడలేదు, రైలును ముందుకు నెట్టి ఇంజన్ స్టార్ట్ చేయించి మరి గమ్యస్థానం చేరుకున్నారు.
కార్లు, వాహనాలు నిలిచిపోతే ముందుకు, వెనక్కు నెట్టి ఇంజన్ స్టార్ట్ చేయించిన సంఘటనలు మనం చాలనే చూశాం. అయితే రైలును ఆ విధంగా స్టార్ట్ చేయించిన సంఘటన శుక్రవారం మద్య ప్రదేశ్ లో జరిగింది.

శుక్రవారం కైలార్-సబల్ ఘర్స్ మద్య రైలు బయలుదేరింది. రైలు లోని అన్ని బోగీలలో ప్రయాణికులు ఉన్నారు. గ్వాలియర్ లోని రాందాన్ ప్రాంతంలోని ఘాటి దగ్గర లోకోమాటో రైలు ఇంజన్ ఒక్క సారిగా నిలిచిపోయింది. సుమారు ఒక గంట పాటు రైలు కదలలేదు.
విసిగిపోయిన ప్రయాణికులు దాదాపు అందరూ కిందకు దిగారు. తరువాత రైలును ముందుకు నెట్టారు. అక్కడ ఉన్న ప్రజలు విషయం గుర్తించి ముక్కున చేయి అందించారు. చివరికి రైలు కదలడంతో ప్రయాణికులు ఒక గంట ఆలస్యంగా గమ్యం చేరుకున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications