బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Marriage: ఇద్దరూ ఇంజనీర్లు, ముహూర్తాకి ముందే పెళ్లి, కట్ చేస్తే వారం రోజుల్లో పెళ్లి కొడుకు ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ విజయపురం: ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరినోట విన్నా ఒకే మాట. కరోనా.... కరోనా.... కోవిడ్....కోవిడ్. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో అమాయకుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇంజనీర్లు అయిన యువతి, యువకుడు ఇటీవలే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అమ్మాయి మెడలో తాళికట్టిన పెళ్లి కొడుకు శోభనం చేసుకున్న మరుసటి రోజు అనారోగ్యానికి గురై ఆసుపత్రిపాళైనాడు. కరోనా కాటుతో వారం రోజులు తిరగకముందే ఆ టెక్కీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కాళ్లపారాణి ఆరక ముందే లేడీ టెక్కీ జీవితాన్ని కరోనా వైరస్ మహమ్మారి నాశనం చేసింది.

Love story: ప్రియుడితో హీరోయిన్ రొమాన్స్, అడ్డుపడిన సోదరుడు ఫినిష్, తల, మొండెం, కాళ్లు !Love story: ప్రియుడితో హీరోయిన్ రొమాన్స్, అడ్డుపడిన సోదరుడు ఫినిష్, తల, మొండెం, కాళ్లు !

రైల్వే శాఖలో ఇంజనీరు

రైల్వే శాఖలో ఇంజనీరు

కర్ణాటకలోని విజయపురం జిల్లా ముద్దబీహాళ తాలుకా డోంకమడు గ్రామానికి చెందిన సిద్దప్ప పూజారి (28) అనే యువకుడు సివిల్ ఇంజనీరింగ్ విధ్యాభ్యాసం పూర్తి చేసి రైల్వే శాఖలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. విజయపురలో నివాసం ఉంటూ సైన్యంలో పని చేస్తూ రిటైడ్ అయిన వ్యక్తి కుమార్తెతో సిద్దప్ప పూజారి పెళ్లి కొన్ని నెలల ముందే నిశ్చయం అయ్యింది.

 అమ్మాయి ఇంజనీర్

అమ్మాయి ఇంజనీర్

మాజీ సైనికుడి కుమార్తె కూడా బీఇ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చెయ్యాలని వేచి చూస్తోంది. ఇంజనీర్లు ఇద్దరూ పెళ్లి చేసుకుంటే వారి జీవితం సాఫీగా సాగిపోతుందని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఏప్రిల్ 25వ తేదీన విజయపురలోని రాజరాజేశ్వరి కల్యాణమండపంలో లేడీ టెక్కీ, రైల్వే శాఖ ఇంజనీరు సిద్దప్ప పూజారి పెళ్లి చెయ్యాలని పెద్దలు ముహూర్తం నిర్ణయించారు.

రెండు రోజుల ముందే పెళ్లి

రెండు రోజుల ముందే పెళ్లి

ఆరు నెలల క్రితమే అనారోగ్యానికి గురైన సిద్దప్ప పూజారి సెలవులపై ఇంటికి వచ్చి విజయపురంలోని ఇంటిలోనే ఉంటున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి తాండవం చెయ్యడంతో కల్యాణపండపంలో చెయ్యాల్సిన పెళ్లి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తాని కంటే రెండు రోజుల ముందే (ఏప్రిల్ 23వ తేది)న అమ్మాయి ఇంటిలోనే ఆత్రుతగా సిద్దప్ప పూజారి, ఆ అమ్మాయి పెళ్లి చేసేశారు.

శోభనం జరిగిన మరుసటి రోజు ?

శోభనం జరిగిన మరుసటి రోజు ?


పెళ్లి జరిగిన రోజు రాత్రి సిద్దప్ప పూజారి శోభనం కూడా జరిగిపోయింది. పెళ్లి జరిగిన మరుసటి రోజు ఉదయం పెళ్లి కొడుకు సిద్దప్ప పూజారి ఊపిరిపీల్చుకోవడంలో చాలా ఇబ్బందికి గురికావడంతో ఆయన్ను విజయపురలోని ఆసుపత్రిలో చేర్పించారు. సిద్దప్ప పూజారికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది.

కాళ్లపారాణి ఆరకముందే చావు

కాళ్లపారాణి ఆరకముందే చావు


వారం రోజుల నుంచి కరోనా వైరస్ మహమ్మారితో పోరాటం చేసిన పెళ్లి కొడుకు సిద్దప్ప పూజారి చికిత్స విఫలమై ప్రాణాలు వదిలేశాడు. పెళ్లి కుమార్తె కాళ్లపారాణి ఆరకముందే పెళ్లి కొడుకు సిద్దప్ప పూజారి ప్రాణాలు పోవడంతో రెండు కుటంబాల్లో విషాదచాయలు నెలకోన్నాయి. అనారోగ్యంతో ఉన్నాడని తెలిసినా సిద్దప్ప పూజారికి అత్రతుగా వివాహం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

English summary
Engineer: Newly married civil engineer dies due to COVID- 19 respiratory failure in Vijayapura in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X