• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వచ్చే వెయ్యి రోజుల్లో: ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ దాకా: శతృవు ముఖం పగులగొట్టేలా: మోడీ

|

న్యూఢిల్లీ: పవిత్ర భారత భూమికి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా తాము పోగొట్టుకోబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) నుంచి వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వరకూ ఒక్క ఇంచ్ భూమినీ వదులుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నామని, శతృవు ముఖం పగులగొట్టేలా బదులు ఇచ్చామని నరేంద్ర మోడీ అన్నారు. శతృవును తాము ఎలా సమాధానం ఇచ్చారనే విషయాన్ని ప్రపంచం మొత్తం తిలకించిందని చెప్పారు.

నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అంటే ఏంటి..? ఇది ఎంత వరకు ఉపయోగకరం..?

ఆ అకాంక్షను నెరవేరుస్తాం: తపస్సులా కరోనా వ్యాక్సిన్ తయారీ: మూడు టీకాలు: బ్లూప్రింట్ రెడీ: మోడీ

  Andhra Pradesh : పంద్రాగస్టు వేడుకలు Vijayawada లోనే, చురుగ్గా ఏర్పాట్లు!! || Oneindia Telugu
  రెడ్‌ఫోర్ట్‌పై నుంచి..

  రెడ్‌ఫోర్ట్‌పై నుంచి..

  దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ ఉదయం రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళిని అర్పించారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. ప్రధానమంత్రిగా మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం వరుసగా ఇది ఏడోసారి. అనంతరం ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు.

  సరిహద్దుల్లో కట్టుదిట్టం..

  సరిహద్దుల్లో కట్టుదిట్టం..

  దేశ సరిహద్దుల్లో శతృవులు పొంచి ఉన్నారనే విషయం పట్ల అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద శతృవుకు భారత సైనికులు గట్టిగా బుద్ధి చెప్పారని చెప్పారు. రక్షణరంగం ఎంత బలంగా ఉందో ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సైనికులకు దక్కుతుందని ప్రధాని అన్నారు. మరోసారి దేశ సరిహద్దులను దాటుకుని రావడానికి శతృదేశాల సైనికులు సాహసం చేయడానికి భయపడేలా.. ముఖం పగులగొట్టే సమాధానం ఇచ్చామని ప్రధాని చెప్పారు.

  వీర మరణం పొందిన సైనికులు

  వీర మరణం పొందిన సైనికులు

  దేశ సరిహద్దులను పరిరక్షించుకునే క్రమంలో పలువురు సైనికులు వీరమరణం పొందారని మోడీ అన్నారు. వారికి మరణం లేదని, అమరులు అయ్యారని చెప్పారు. దేశాన్ని రక్షించుకునే క్రమంలో బలిదానం చేసిన సైనికులకు వందనం అర్పిస్తున్నానని ప్రధాని చెప్పారు. దేశం అనుసరిస్తోన్న రక్షణాత్మక, దౌత్య సంబంధాలు, వ్యూహాలను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని చెప్పారు. భారత్‌తో స్నేహ హస్తాన్ని అందించడానికే అనేక దేశాలు మొగ్గు చూపుతున్నాయని మోడీ అన్నారు.

  ఐక్యరాజ్య సమితిలో సగర్వంగా..

  ఐక్యరాజ్య సమితిలో సగర్వంగా..

  ఐక్యరాజ్య సమితిలోని 194 దేశాల్లో 184 దేశాలు భారత వైపు ఉన్నాయని ప్రధాని గుర్తు చేశారు. ఐక్యరాజ్య సమితిలో తాత్కాలిక సభ్యత్వాన్ని కల్పించడానికి నిర్వహించిన ఎన్నికల్లో 184 దేశాలు భారత్‌కు అనుకూలంగా ఓటు వేసిన సందర్భాన్ని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఉగ్రవాదులైనా.. శతృదేశాలైనా తాము ఒకే రకమైన రణనీతిని అనుసరిస్తున్నామని, వారికి తగిన గుణపాఠం చెప్పేలా యుద్ధ నీతిని రూపొందించుకుంటున్నామని అన్నారు.

  లక్షద్వీప్‌కూ

  లక్షద్వీప్‌కూ

  వచ్చే వెయ్యి రోజుల్లో లక్షద్వీప్‌కు కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ప్రధాని తెలిపారు. దీనికోసం ఇప్పటి నుంచే కార్యక్రమాలను మొదలు పెట్టామని చెప్పారు. కొద్దిరోజుల కిందటే అండమాన్ నికోబార్ దీవులకు డిజిటల్ ఫైబర్ కనెక్టివిటీని కల్పించామని, ఇక లక్షద్వీప్‌కూ అదే తరహా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. దీనివల్ల రక్షణపరంగా ఆయా ప్రాంతాలకు గట్టి రక్షణను కల్పించినట్టవుతుందని చెప్పారు.

  మోడీ పుట్టినరోజు: 2014 నుంచి జన్మదిన వేడుకలను ఎలా జరుపుకొంటున్నారో తెలుసా?

  English summary
  Prime Minister Narendra Modi says that Be it an aggressor or a terrorist, India is fighting them. Out of 192, 184 countries supported us at the United Nations Security Council, the PM also said. This is because we are strong and secure.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X