సుప్రీంను తాకిన నిరసనల సెగ.. ! సీజేఐ సూర్యకాంత్ కీలక నిర్ణయం...!
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీలో రెండు రోజులుగా జరుగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నిరసనల్లో తొలి రోజు నుంచే పాల్గొంటున్న సుప్రీంకోర్టు లాయర్లు.. ఇప్పుడు తమపై పోలీసుల దౌర్జన్యాలపై సీజేఐను ఆశ్రయించారు. ఈ మేరకు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణన్ సీఈసీ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న #ఢిల్లీనిరసనలకు సంబంధించిన పిటిషన్‌ను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సీజేఐ సూర్యకాంత్ (CJI) .. నిరసనల్లో పాల్గొనే హక్కు న్యాయవాదులకు ఉందని స్పష్టం చేశారు.
ఢిల్లీ నిరసనల్లో సెక్షన్ 163 ఉత్తర్వులు ఏవీ బహిరంగంగా అందుబాటులో లేవని, తాము ఓ సెక్షన్ చట్టబద్ధతను కూడా సవాలు చేశామని అడ్వకేట్ శంకర్ నారాయణ్ సీజేఐకి తెలిపారు. ఫరాసత్ సహా సీనియర్ అడ్వకేట్లను ఢిల్లీ వీధుల్లో ఈడ్చుకెళ్లారని, ఇది చాలా అనుచితంగా ఉందని అన్నారు. పోలీసులు గూండాలు పిల్లలపై దాడి చేసేందుకు సైతం అనుమతించడాన్ని ప్రస్తావింంచారు. తాము సహకరించడానికి ప్రయత్నించాలని, సంయమనం పాటించాలని మీ గౌరవనీయ న్యాయమూర్తులు చెప్పారని, మీరు పోలీసులకు కూడా అదే చెబుతారని ఆశిస్తున్నామని సీజేఐకి తెలిపారు. ఇతర విషయాలతో పాటు దీనిని కూడా రేపు విచారణకు తీసుకోవచ్చని సూచించారు.

దీనిపై స్పందించిన సీజేఐ సూర్యకాంత్.. తాను ప్రస్తుతానికి ఏమీ చెప్పదలుచుకోలేదన్నారు. సుప్రీంకోర్టు అలా మారడానికి తాము అనుమతించబోమన్నారు. కానీ ప్రతి న్యాయవాదికి నిరసనలో పాల్గొనే హక్కు ఉందన్నారు. దీనిపై స్పందించిన అడ్వకేట్ శంకర్ నారాయణన్.. పోలీసులు పిల్లల తలలపై కొట్టి, తామే ఇది చేశామని గర్వంగా చెప్పుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. మీరేమో మమ్మల్ని సంయమనం పాటించమని చెబుతున్నారని, దీనిపై తాను దిగ్భ్రాంతికి గురయ్యానని సీజేఐకి తెలిపారు. మరో ఇద్దరు న్యాయవాదులను బస్సుల్లో నిర్బంధించారని, ఏదో ఒక సమయంలో, ధర్మాసనం బార్‌ను ఆదుకుంటుందన్నారు. పోలీసులు తాము ఏమైనా చేసి తప్పించుకోగలమని అనుకుంటున్నారని మండిపడ్డారు. దీంతో ఈ కేసును రేపు విచారణకు లిస్ట్ చేస్తామని సీజేఐ హామీ ఇచ్చారు.














Click it and Unblock the Notifications
