ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..! సర్కార్ కు షాక్..!

ఏపీలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ ప్రభుత్వం (AP Govt) తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు వీల్లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వానికి ఇవాళ షాక్ తగిలింది. గతంలో తాము పలు కేసుల్లో ఇచ్చిన తీర్పుల మేరకు బీసీ రిజర్వేషన్లను పెంచుకునేందుకు వీల్లేదంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

సుప్రీంలో బీసీ రిజర్వేషన్ల కేసు-ఢిల్లీలో ఏపీ మంత్రుల పాగా- లాబీయింగ్..!
సుప్రీంలో బీసీ రిజర్వేషన్ల కేసు-ఢిల్లీలో ఏపీ మంత్రుల పాగా- లాబీయింగ్..!

రాష్ట్రంలో స్దానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు తోసిపుచ్చిన బీసీ రిజర్వేషన్ల పెంపును మరోసారి చంద్రబాబు సర్కార్ తెరపైకి తెచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో 34 శాతానికి , గ్రామీణ స్థానిక సంస్థల్లో 33.33 శాతానికి రిజర్వేషన్లను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడమే కాకుండా, జీవోలు కూడా జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ తాండవ యోగేష్ అనే లాయర్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు.. బీసీ రిజర్వేషన్ల పెంపు సుప్రీంకోర్టు గత మార్గదర్శకాలకు విరుద్దమని పేర్కొంటూ కొట్టేసింది.

Major Setback for AP Govt as Supreme Court Rejects Plea on 34 BC Reservations
ఏపీలో స్థానిక ఎన్నికలు, బ్యాలెట్ పేపర్ల వాడకంపై ఎస్ఈసీ క్లారిటీ..!
ఏపీలో స్థానిక ఎన్నికలు, బ్యాలెట్ పేపర్ల వాడకంపై ఎస్ఈసీ క్లారిటీ..!

దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. వివిధ కారణాలను చూపుతూ బీసీ రిజర్వేషన్లను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్లు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం గరిష్ట పరిమితిని మించకూడదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో గతంలో హైకోర్టు ఈ వ్యవహారంలో ఇచ్చిన తీర్పు అమలు కానుంది. ఈ తీర్పును ప్రభుత్వం ముందే ఊహించింది. దీంతో కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా పార్టీ తరఫున 34 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తామంటూ మంత్రి నారా లోకేష్ తాజాగా ప్రకటించారు. మరోవైపు విపక్ష వైసీపీ మాత్రం చెల్లవని తెలిసీ 34 శాతం రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+