Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వివాహేతర సంబంధాలు నా బలహీనత ప్రశ్నించొద్దు, మాజీ ఎంఏల్ఏ ఇంటి ఎదుట భార్య ధర్నా

ఆయన ఓ పార్టీ నాయకుడు మాజీ ఎంఏల్ఏ , అయితే వివాహేతర సంబంధాలు కొనసాగించడం తన బలహీనత అని, ఈ విషయాలలపై తనను ప్రశ్నించకూడదని ఆయన తనభార్యను ఆదేశించాడు. ఇదే విషయమై ఆయనను ప్రశ్నిస్తే ఆమెను కొట్టి బయటకు పంపాడ

బెంగుళూరు :ఆయన ఓ పార్టీ నాయకుడు మాజీ ఎంఏల్ఏ , అయితే వివాహేతర సంబంధాలు కొనసాగించడం తన బలహీనత అని, ఈ విషయాలలపై తనను ప్రశ్నించకూడదని ఆయన తనభార్యను ఆదేశించాడు. ఇదే విషయమై ఆయనను ప్రశ్నిస్తే ఆమెను కొట్టి బయటకు పంపాడు. దీంతో ఇంటి ఎదుటే కూర్చొని నిరసనకు దిగింది. మరో వైపు తన భార్య తనను బ్లాక్ మెయిలింగ్ చేస్తోందని మాజీ ఎంఏల్ఏ ప్రత్యారోపణలు చేశాడు.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని ముదిగెరె అసెంబ్లీ స్థానం నుండి గతంలో ప్రాతినిథ్యం వహించిన మాజీ ఎంఏల్ఏ కుమారస్వామి సతీమణి సవిత భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగడం సంచలనానికి కారణమైంది. వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించిన తనపై భర్త దాడికి దిగాడని ఆమె ఆందోళనకు దిగింది.

 ex mlas wife sits on dharn outside his house

కుమారస్వామికి వివాహేతర సంబంధం ఉంది, ఈ విషయమై అతని భార్య సవితి ఆయనను ప్రశ్నించింది. ఆమె నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేస్తోంది. ఈ విషయమై ఆమె ప్రశ్నిస్తే ఆయన ఆమెపై దాడికి దిగాడు. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం తన బలహీనత అని, ఈ విషయమై తనను ప్రశ్నించకూడదని ఆయన భార్యకు సూచించారు.

తన వివాహేతర సంబంధాల విషయమై భర్తను నిలదీయడంతో సహించలేక ఆమెపై ఆయన దాడి చేశాడు. దీంతో ఆమె ఇంటి ముందే ధర్నాకు దిగింది.తనను కొట్టి భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాడని ఆమె ఆరోపించింది.అయితే ఈ ఆరోపణలను ఆయన కొట్టిపారేశాడు. తనకున్న 30 ఎకరాల కాఫీ తోటను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని తన భార్య తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని కుమారస్వామి ఆరోపించాడు.

అయితే బిజెపి ప్రతిష్టకు దెబ్బకలిగేలా కుటుంబ వ్యవహరంలో ప్రవర్తించకూడదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కుమారస్వామికి హితవు పలికారు. ఈ వ్యవహరం బెంగుళూరులో చర్చనీయాంశమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+