సోషల్ మీడియా అరెస్టులపై తేల్చేసిన కేంద్రం- లోక్‌సభలో ప్రకటన

Chandrababu Naidu: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై ఇటీవలే అధికార టీడీపీ కూటమి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య వార్ నడిచింది. అసభ్యకర పోస్టులను వేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తేల్చి చెప్పారు.

గతంలో వైఎస్ జగన్, ఇతర నాయకుల‌పై టీడీపీ కార్యకర్తలు సైతం దారుణ‌మైన పోస్టులు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి దిగిన విషయం తెలిసిందే. గన్‌, ఆయన కుటుంబ సభ్యులపై దిగజారిపోయి, నీచాతినీచంగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు పెట్టిన విషయాన్ని మాజీ మంత్రి రోజా గుర్తు చేశారు అప్పట్లో.

Existing laws more stringent to curb vulgar content on social media says Ashwini Vaishnaw

ఈ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన కంటెంట్‌ను తనిఖీ చేసేలా చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.

లోక్‌సభలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో అభ్యకరమైన పోస్టులను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన అన్నారు. దినపత్రికలు, మీడియా సంస్థల్లో ఎడిటోరియల్ కంటెంట్‌ను చెక్ చేయడానికి ప్రత్యేకంగా ఎడిటోరియల్ వ్యవస్థ ఉందని గుర్తు చేశారు. ఏవైనా తప్పులు దొర్లితే దాన్ని సరి చేస్తారని చెప్పారు.

సోషల్ మీడియాలో మాత్రం అలాంట వ్యవస్థ అంటూ ఏదీ లేదని అశ్విని వైష్ణవ్ అన్నారు. యూజర్లు మీడియాకు మించి స్వేచ్ఛగా వ్యవహరిస్తోన్నారని, ఎలాంట నియంత్రణ వ్యవస్థ అందుబాటులో లేదని చెప్పారు. ఫలితంగా అనేక రకాల అసభ్యకరమైన కంటెంట్‌ పోస్ట్ అవుతోందని పేర్కొన్నారు.

సోషల్ మీడియాను నియంత్రించడానకి ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాన్ని ఖచ్చితంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై సభ మొత్తం ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. మన దేశ సంస్కృతికి ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఆవిర్భవించన దేశాలకు చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+