ఎగ్జిట్ పోల్స్: మోడీ గాలితో 289 సీట్లు, నితీష్‌కు షాక్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ సోమవారం ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. టైమ్స్ నౌ, సిఎన్ఎన్ ఐబిఎన్, ఎబిపి వంటి పలు ఛానళ్లు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలను విడుదల చేశాయి. దాదాపు అన్ని సర్వేల్లోను ఎన్డీయేనే ముందంజలో ఉంది.
సిఎన్ఎన్ - ఐబిఎన్ సర్వే ప్రకారం ఢిల్లీలో బిజెపియే ఎక్కువ స్థానాలను గెలుచుకోనుంది. బిజెపి 5-7, ఆమ్ ఆద్మీ పార్టీ 0-2 స్థానాలు గెలుచుకుంటుంది. పంజాబ్ రాష్ట్రంలో బిజెపి-అకాళీదళ్ కూటమి 6-9, ఎఎపి 1-3, కాంగ్రెసు పార్టీ 3-5 స్థానాలు గెలుచుకోనుంది.

టైమ్స్ నౌ ప్రకారం.. త్రిపురలో సిపిఎం 1, మిజోరాంలో కాంగ్రెస్ 1, నాగాలాండులో ఎన్డీఎఫ్ 1, సిక్కింలో ఎస్టీఎఫ్ 1 లోకసభ స్థానాలు గెలుచుకోనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెసు, బిజెపిలు చెరొకటి గెలుచుకుంది. మణిపూర్‌లో రెండు లోకసభ స్థానాలు కాంగ్రెసు గెలుచుకోనుంది.
మేఘాలయలో కాంగ్రెస్, ఎన్సీపిలు చెరొకటి గెలుచుకుంటాయి. అసోంలో కాంగ్రెస్ 5, బిజెపి 8, ఏయుడిఎప్ 5 స్థానాలు, మధ్యప్రదేశ్‌లో బిజెపి 26, కాంగ్రెసు 3, గుజరాత్‌లో బిజెపి 22, కాంగ్రెసు 4 స్థానాలు గెలుచుకోనున్నాయి.
బీహార్ రాష్ట్రంలో జెడియుకు గట్టి షాక్ తగలనుంది. బీహార్లో కాంగ్రెసు 2, బిజెపి 28, జెడియు 10 స్థానాలు గెలుచుకుంటాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ 5, బిజెపి 2, తృణమూల్ కాంగ్రెస్ 20, లెఫ్ట్ పార్టీలు 15 స్థానాలు గెలుచుకోనున్నాయి. ఒడిశాలో కాంగ్రెస్ 5, బిజెపి 1, బిజెడి 15 లోకసభ స్థానాలు గెలుచుకోనున్నాయి.
హర్యానాలో కాంగ్రెసు పార్టీ 0-2, బిజెపి 7-9 స్థానాల్లో గెలుపొందనున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి 46, కాంగ్రెస్ 8, బిఎస్పీ 13, ఎస్పీ 12 స్థానాలు గెలుచుకోనున్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెసు 0-4, బిజెపి 21-25 స్థానాల్లో, తమిళనాడులో డిఎంకె 7-11, బిజెపి 4-6, అన్నాడిఎంకె 22-28 స్థానాల్లో, జార్ఖండ్‌లో బిజెపి 7, కాంగ్రెస్ 6 స్థానాలు, కేరళలో యూడిఎఫ్ 11-14, ఎల్డీఎఫ్ 7-9 స్థానాలు, కర్నాటకలో కాంగ్రెస్ 12-16, బిజెపి 16-14 స్థానాలు గెలుచుకోనున్నాయి. మరో సర్వే కర్నాటసలో బిజెపి 18, కాంగ్రెసు 9, జెడిఎస్ 1 స్థానంలో గెలుస్తుందని చెబుతోంది.
న్యూస్ ఎక్సుప్రెస్ సర్వే ప్రకారం... భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 289, కాంగ్రెసు నేతృత్వంలోని యూపిఏకు 101, ఇతరులకు 153 స్థానాలు రానున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే ఎన్డీయే హవానే ఉందని దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నాయి. కేవలం ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెసు పార్టీ హవా కొనసాగుంది.












Click it and Unblock the Notifications