ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మకండి.. నిరాశలో ఉన్న కార్యకర్తలకు ప్రియాంక ఆడియో సందేశం
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు మరోసారి ఎన్జీఏకు పట్టం కట్టనున్నారన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌పై తొలిసారి స్పందించి ఆమె.. కార్యకర్తలకు ఆడియో సందేశాన్ని పంపారు. సర్వే ఫలితాలను నమ్మొద్దని ప్రియాంక కోరారు. కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
"ఎగ్జిట్ పోల్స్ చూసి మీరు నిరుత్సాహానికి గురై ఉంటారు. కానీ ఆ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొద్దు. కార్యకర్తలందరూ స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ సెంటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిందుకు అందుకు తగ్గ ఫలితాలు కచ్చితంగా వస్తాయని భావిస్తున్నా"నంటూ ప్రియాంక కార్యకర్తలకు పంపిన ఆడియో సందేశంలో చెప్పారు.

ఆదివారం చివరి విడత పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఎన్డీఏ 300లకుపైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 120 సీట్లకే పరిమితమవుతాయన్న అంచనాలు వెల్లడయ్యాయి. బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ బలం పుంజుకుంటుందని సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications