వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొలంబోకు చైనా సబ్‌మెరైన్లు: నిపుణుల సూచనలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: శ్రీలంక నవల్ స్టాఫ్ చీఫ్ వైస్ అడ్మిరల్ జయంత పెరీరా సోమవారం భారతదేశంలో పర్యటించారు. ‘ఇండియా భద్రతే మా బాధ్యత' అని శ్రీలంకలో చైనా మిలిటరీ ఉనికిపై ఆయన అన్నారు. చైనాతో శ్రీలంక వాణిజ్యపరమైన కార్యకలాపాలకే పరిమితమవుతుందని ఆయన చెప్పారు. శ్రీలంకలో చైనా మిలిటరీ దళాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు.

గత నెలలో పీపుల్స్ లీబిరేషన్ ఆర్మీ-నేవీల (పిఎల్ఏ-ఎన్) టైప్-039 సాంగ్ క్లాస్ సబ్‌మెరైన్ కొలంబోలో సరిహద్దుల్లోకి చేరుకుంది. ఇది భారత సముద్ర ప్రాంతం(ఐఓఆర్)కు సమీపంలోనే ఉండటం గమనార్హం.
కాగా, తమ సరిహద్దుల్లోకి వచ్చిన చైనా సబ్‌మెరైన్ న్యూక్లియర్‌వి కాదని, దీనిపై భారత నిపుణులు పలు సూచనలు చేశారని వైస్ అడ్మిరల్ పెరీరా పేర్కొన్నారు.

శాంతి, యుద్ధం: సబ్స్

భవిష్యత్ అవసరాల కోసమే చైనా తన సబ్‌మెరైన్ భారత సరిహద్దు సమీపంలోని జలాల్లో ప్రవేశపెట్టడం అనేది ఆశ్చర్యం కలిగించనప్పటికీ ఇదొక హెచ్చరికలాంటిదని సిడిఆర్(రిటైర్డ్) రాయ్ ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు.

‘సరిహద్దుల్లో దాడులు, సముద్రాలలో చైనా కార్యకలాపాలను చిన్నగా చూడకూడదు. వాటిపై అధ్యయనం చేయాల్సి ఉంది. శాంతి కాలంలో యుద్ధనౌకలు దేశాల మధ్య అంబాసిడర్‌లుగా పనిచేస్తాయి. చైనా సైనికులు వచ్చినప్పుడు వారికి భారత సముద్రతీరంలో ఘనమైన ఆతిథ్యం లభించింది. శాంతి, యుద్ధ కాలంలో సబ్‌మెరైన్స్ వల్ల చేపలు చిక్కులు ఎదుర్కొంటాయి' అని కొచ్చిలో మీడియా కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా గతంలో పనిచేసిన సిడిఆర్(రిటైర్డ్) రాయ్ అన్నారు.

సబ్‌మెరైన్ సంచరించడం అనేది స్ట్రింగ్ ఆఫ్ పియర్స్ సిద్ధాంతం ప్రకారం ఇండియాతోపాటు ఆసియా చుట్టూ చైనా చుట్టుముడుతున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

‘పాకిస్థాన్‌లోని గ్వాడర్ పోర్ట్, మయన్మార్‌లో కొన్ని పోర్టులు, శ్రీలంకలో కొన్ని పోర్టులను నిర్మించేందుకు చైనా ఆసక్తి చూపుతోంది. అయితే ఇది నిస్వార్థంగా చేస్తోందనడానికి వీళ్లేదు. భారత పర్యటనతోపాటు చైనా అధ్యక్షుడు పొరుగున ఉన్న చిన్నదేశాలైన శ్రీలంక, మాల్దీవులు, ఇతర దేశాల్లో కూడా పర్యటించారు. శ్రీలంక వాస్తవం తెలుసుకోకుండా చైనా నుంచి సబ్‌మెరైన్లను తన సరిహద్దులో ఉంచుకోవడానికి అనుమతిస్తోంది. అయితే చైనా ఉచ్చులో చిక్కుకోకూడదని ఇరుగుపొరుగు రాష్ట్రాలకు చెప్పాల్సిన బాధ్యత ఇండియాపై ఉంది.' అని రాయ్ అన్నారు.

శాంతి సమయంలో సబ్‌మెరైన్లు అందంగానే కనిపిస్తాయని ఆయన చెప్పారు. ‘అవి నిజమైన వ్యాపారాల(నేవీ)ను అంతచేసేవిగా కూడా ఉంటాయి. చైనాకు 50కి పైగా సబ్ మెరైన్లు ఉన్నాయి, ఓ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా ఉంది. ఇది భారత సముద్రతీర ప్రాంతంలో అలజడి పెంచేదిగా కనిపిస్తోంది. సబ్‌మెరైన్ అధిక సామర్థ్యం కలిగి, యుద్ధం వస్తే అవి సృష్టించే విధ్వంసం కూడా అదే స్థాయిలో ఉంటాయి' అని రాయ్ తెలిపారు.

ఇండియా పరిశీలిస్తూ వేచి చూడాలి

అనేక కారణాల వల్ల చైనా శ్రీలంకతో సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఢిల్లీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ అనలసీస్(ఐడిఎస్ఏ) రీసెర్చ్ అసిస్టెంట్ అవినాశ్ గోడ్బెల్ అన్నారు.

‘ఆసియాలో మారిటైమ్ సిల్క్ రోడ్(ఎంఎస్ఆర్) ఆపడం, డిఫెన్స్ షీప్స్‌కు ఇంధనం అందించేందుకు పలు ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవడం. ఇవి చైనా భవిష్యత్‌లో కోరుకున్నప్పుడు చైతన్యవంతంగా పనిచేస్తాయి. భారత సరిహద్దు చుట్టూ ఉన్న సముద్ర ఉపరితలంపై జరుగుతున్న కార్యకలాపాలను భారత్ క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది' అని ఇండియా-చైనా సంబంధాలు, చైనా విదేశీ విధానంపై నిపుణుడు అవినాశ్ తెలిపారు.
భారత్ కూడా శ్రీలంక, మాల్దీవులు, ఇతర ఇరుగుపొరుగుదేశాలతో సఖ్యతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Experts see several implications to Chinese submarine’s visit to Colombo

సెయింట్ డెనీస్ పోర్ట్ వద్ద నావల్ నౌకలు

ఇండియన్ నావల్ షిప్స్ ముంబై, తల్వార్, తెగ్, దీపక్‌లు రీయర్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ నేతృత్వంలో భారత పశ్చిమ, తూర్పు, దక్షిణ సముద్ర సరిహద్దులో సంచరిస్తున్నాయని భారత నేవీ తెలిపింది. ‘మరో నాలుగింటిలో మూడు, ఐన్ఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ దీపక్‌లు సెయింట్ డెనిస్ పోర్టుకు సోమవారం చేరుకున్నాయి. భారత్- ఫ్రాన్స్ దైపాక్షిక రక్షణ సంబంధాల నేపథ్యంలో వీటిని ప్రదర్శించారు' అని నావల్ అధికార ప్రతినిధి కెప్టెన్ డికె శర్మ తెలిపారు.

English summary

 The visiting Sri Lankan Chief of Naval Staff Vice Admiral Jayantha Perera perfectly played to the gallery on Monday. Ruling out any Chinese military presence in the island nation, he said, "India's security is as our security."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X