ట్రంప్ తో మోడీ మాట్లాడకపోవడం వల్లే..! 8 ఫోన్ కాల్స్ గుర్తుచేసిన భారత్..!
భారత్-అమెరికా మధ్య గతేడాది వాణిజ్య ఒప్పందం కుదరకపోవడం, ఆ తర్వాత భారత్ పై ఏకంగా 50 శాతం సుంకాల విధింపు వెనుక ట్రంప్ తో ప్రధాని మోడీ మాట్లాడకపోవడమే కారణమంటూ యూఎస్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చేసిన వాదన చర్చనీయాంశమైంది. గతంలో ట్రంప్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మోడీ స్పందించలేదని వార్తలు కూడా రావడంతో ఈ వాదన నిజమేనేమో అన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఇవాళ కేంద్రం వివరణ ఇచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నేరుగా మాట్లాడకపోవడం వల్లే భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం జరగలేదని అమెరికా మంత్రి హోవార్డ్ లుట్నిక్ చేసిన వాదన సరికాదని విదేశాంగశాఖ స్పష్టత ఇచ్చింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి లేదా తన డిమాండ్లకు అనుగుణంగా ప్రధాని మోడీతో వ్యక్తిగతంగా చర్చించడానికి ట్రంప్ నిరాకరించిన తర్వాత తాజా పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలిపింది.

మోడీ తనతో మాట్లాడలేదని చెప్పడం ద్వారా ట్రంప్ ఇగో కారణంగానే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోలేదని దీన్ని బట్టి అర్ధమవుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ విదేశాంగశాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ మంత్రి లుట్నిక్ వ్యాఖ్యలను చూశామని, గతేడాది ఫిబ్రవరి 13 నాటికే భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడానికి కట్టుబడి ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అప్పటి నుండి వాణిజ్య ఒప్పందానికి రావడానికి ఇరుపక్షాలు అనేక రౌండ్ల చర్చలు జరిపాయని, అనేక సందర్భాల్లో తాము ఈ ఒప్పందానికి దగ్గరగా కూడా వచ్చినట్లు తెలిపారు. కానీ ఇప్పుడు లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయన్నారు.

#WATCH | Delhi | MEA Spokesperson Randhir Jaiswal says, "Prime Minister Modi and President Trump have a friendly relationship and have always addressed each other with mutual respect as per diplomatic norms..." pic.twitter.com/6px94iyAE3
— ANI (@ANI) January 9, 2026
రెండు పరిపూరక ఆర్థిక వ్యవస్థల మధ్య పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని కొనసాగించడానికి భారతదేశం కట్టుబడి ఉందని, చర్చలను ఒక ముగింపుకు తీసుకురావాలని ఆసక్తిగా ఉందని జైశ్వాల్ తెలిపారు. 2025లో ప్రధాని మోడీ, డొనాల్డ్ ట్రంప్ ఎనిమిది సందర్భాలలో ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారని, వారి విస్తృత భాగస్వామ్యం యొక్క వివిధ కోణాలను చర్చించారని కూడా ఆయన గుర్తుచేశారు.
-
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications