ఐటీ హబ్ లో కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం, మేడమ్ కు పెళ్లికాలేదని ఏం చేశారంటే ?, గ్రహదోషం !
ఓ యువతికి పెళ్లి వయసు వచ్చి చాలా సంవత్సరాలు దాటిపోయింది. ఎంతకాలం అయినా, ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా పెళ్లికాలేదని ఆవేదనతో ఆ యువతి స్నేహితులతో కలిసి బయట తిరగలేకపోయింది. పెళ్లి ఆలస్యమవుతోందంటూ ఓ పెళ్లికాని యువతిని నకిలీ జ్యోతిష్యులు మోసం చేసిన ఉదంతం బెంగళూరులో చోటుచేసుకుంది.
పెళ్లికి తగిన వరుడు దొరకకపోవడంతో బాధితురాలు సరిత (పేరు మార్చాడం జరిగింది) ఓ జ్యోతిష్యుడిని ఆశ్రయించింది. ఒడిశాకు చెందిన సరిత బెంగళూరు చేరుకుని ఇక్కడి వర్తూరులోని గుంజూరులో నివాసం ఉంటున్నది. బెంగళూరులోని ఓ కార్పొరేట్ కంపెనీలో సరిత ఉద్యోగం చేస్తున్నది. సరితకు చాలా కాలం నుంచి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఎక్కడా సరితకు పెళ్లికొడుకు సెట్ కాలేదు.

నీకు గ్రహదోషం ఉందని, నీకు ఆ దోషం పోయి త్వరగా పెళ్లికావాలంటే గొర్రెలను బలి ఇచ్చి ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పి బాధితురాలు సరితను మోసం చేశారు. ఆచారాలు పాటించకుంటే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని నిందితులు సరితను బెదిరించారు. నకిలి జ్యోతిష్యులు చెప్పినట్లు అంతా చేసిన సరిత నిందితులు అడిగినంత డబ్బులు ఖర్చు చేసిందని సమాచారం. అయితే నిందితులు మరింత డబ్బు డిమాండ్ చేయడంతో తాను మోసపోయానని సరిత గ్రహించింది.
చివరికి నకిలి జ్యోతిష్యులు సరిత మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేయడంతో ఆమె హడలిపోయింది. మోసం జరిగిందని ఆలస్యంగా గుర్తించిన సరిత నిందితులపై బెంగళూరులోని వర్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సరితను మోసం చేసిన నిందితులను లవ్ గురు, పరమేశ్వర్ పండిట్‌లుగా గుర్తించామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. సరితను మోసం చేసిన నిందతులు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు.
నాకు పెళ్లి చేసుకోవాలని ఉందని, అయితే తనకు ఎక్కడా పెళ్లి సెట్ కాలేదని సరిత పోలీసులకు చెప్పింది. నేను ఇంటర్నెట్‌లో జ్యోతిష్యుల గురించి ఆరా తీశానని, తరువాత పరమేశ్వర్ పండిట్ నంబర్‌ను కనుగొని అతన్ని సంప్రధించడానికి ప్రయత్నించానని సరిత పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఫిబ్రవరి 25వ తేదీన పరమేశ్వర్‌గా గుర్తించబడిన నిందితులలో ఒకరికి కాల్ చేశానని, తరువాత లవ్ గురుగా పరియం చేసుకున్న మరొక వ్యక్తి నాతో మాట్లాడటం ప్రారంభించాడని సరిత పోలీసులకు చెప్పింది.
నీ గ్రహస్థితి సరిగా లేదని, అందుకే నీకు ఇంతకాలం పెళ్లికాలేదని లవ్ గురు తనకు చెప్పాడని,
నా సమస్యను పరిష్కరించడానికి వారు నన్ను అఘోరీల వద్దకు వెళ్లమని చెప్పారని, నేను అఘోరీల ముందు ఒక గొర్రెను బలి ఇవ్వవలసి ఉంటుందని చెప్పారని, నువ్వు ఇలా చెయ్యకపోతే రానున్న రోజుల్లో నీకు ఇంకా కష్టాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని తనను నిందితులు ఇద్దరూ బెదిరించారని సరిత పోలీసులకు చెప్పింది. తనకు పెళ్లికాదని, లేనిపోని సమస్యలు వస్తాయని నిందితులు ఇద్దరూ తనను బెదిరించారని సరితా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.
నా జాతకంలో కొన్ని పైశాచిక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని నిందితులు తనను నమ్మించారని సరిత తెలిపింది. ఇద్దరూ ఫిబ్రవరి 29వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు దశలవారీగా డబ్బులు బదిలీ చేయించుకున్నారని, తరువాత నిందితుల పదేపదే డబ్బులు లాక్కొని తనను వేధింపులకు గురి చేశారని సరిత ఆరోపించింది. ఫిర్యాదు చేసిన సరిత ఇద్దరు నిందితుల్లోని ఒకరి మొబైల్ ఫోన్ నంబర్ ఇచ్చిందని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని బెంగళూరులోని వర్తూరు పోలీసులు తెలిపారు.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications