బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Doctor: ఆసుపత్రిలో నగలు చోరీ చేసిన లేడీ డాక్టర్ చిక్కింది, మేడమ్, అసలు మ్యాటర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న రమేష్ కుమార్ అనే వ్యక్తి అతని తల్లి సరసను జనవరి 12వ తేదీ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సెయింట్ ఫిలోమినా ఆసుపత్రికి తీసుకొచ్చి ఇన్ పేషెంట్ గా చేర్పించారు. తెల్లకోటు వేసుకున్న సుమారు 35 ఏళ్ల మహిళ ఆసుపత్రిలోని ఇన్ పేషంట్ వార్డుకు వెళ్లింది. రమేష్ కుమార్ దగ్గరకు వెళ్లిన కిలాడీ లేడీ నేను డాక్టర్‌ని, మీ అమ్మగారి చిక్కిత్స చెయ్యాలని చెప్పింది. నువ్వు కాసేపు బయట ఉండు అని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన రమేష్ కుమార్ వార్డు నుంచి బయటకు వెళ్లాడు.

Wife: ఫామ్ హౌస్ లో భార్య మిడ్ నైట్ మసాల, అర్దరాత్రి అనుకోకుండా వెళ్లిన భర్త ?, అస్తిపంజరం ఎవరిది ?, క్లోజ్ !Wife: ఫామ్ హౌస్ లో భార్య మిడ్ నైట్ మసాల, అర్దరాత్రి అనుకోకుండా వెళ్లిన భర్త ?, అస్తిపంజరం ఎవరిది ?, క్లోజ్ !

పది నిముషాల తర్వాత డాక్టర్‌గా నటిస్తున్న కిలాడీ లేడీ వార్డులో నుంచి బయటకు వచ్చింది. మీ అమ్మను డిస్టర్బ్ చేయకు. ఆమె నిద్రపోతున్నది, ఆమెకు కొంతసేపు విశ్రాంతి అవసరం అని చెప్పి వెళ్లిపోయింది. పక్క వార్డులో కూడా మరో మహిళ మెడలో ఆ నకిలి డాక్టర్ బంగారు నగలు చోరీ చేసి అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని వెళ్లిపోయింది.

Fake lady doctor arrested for stealing jewelery from hospital in Bengaluru.

కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మీ అనే మహిళను అరెస్టు చేశారు. బెంగళూరులోనే నివాసం ఉంటున్న నిందితురాలు లక్ష్మి గతంలో నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సుగా పనిచేసిందని పోలీసులు అన్నారు. కుటుంబ కలహాలతో భర్తతో విడిపోయిన లక్ష్మీ కొన్నాళ్లుగా కోరమంగళలో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

Leader: బాలకృష్ణకు సినిమా చూపించిన పోలీసులు, అధికార పార్టీ అనుకుంటే ?, సీఐ కాలర్ పట్టుకుని !Leader: బాలకృష్ణకు సినిమా చూపించిన పోలీసులు, అధికార పార్టీ అనుకుంటే ?, సీఐ కాలర్ పట్టుకుని !

ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న లక్ష్మి ఆమె ఇంటి సమీపంలోని వీధిలో కూరగాయలు విక్రయిస్తున్న మహిళ వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకుంది. ఆదాయం లేకుంటే సకాలంలో రుణం చెల్లించడం సాధ్యం కాకపోవడంతో లక్ష్మీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనింది. ఇంతలో ఆ మహిళ అప్పు తిరిగి ఇవ్వాలని లక్ష్మీని బెదిరించింది. అప్పు తీర్చేందుకు మరో మార్గం లేకుండా దొంగతనానికి పన్నాగం పన్నినట్లు విచారణలో తేలింది.

అశోకనగర్‌లోని సెయింట్ ఫిలోమినా ఆసుపత్రి గురించి నిందితురాలు లక్ష్మీకి బాగా తెలుసని, ఆమెకు అన్ని ప్రవేశాలు, బయటకు వెళ్లే దారుల గురించి పూర్తి సమాచారం ఉందని పోలీసులు అన్నారు. ఓ డాక్టర్ వేసుకున్న తెల్లకోటు ధరించి వైద్యురాలిగా నటిస్తూ వెళ్లిన లక్ష్మీ రోగుల శరీరంపై ఉన్న బంగారు నగలన్నీ చోరీ చేసి పరారైయ్యిందని పోలీసులు అన్నారు. చోరీ చేసిన బంగారం రుణం ఇచ్చిన మహిళకు ఇచ్చి మా రుణం మాఫీ చేయమని చెప్పిందని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Fake lady doctor arrested for stealing jewelery from hospital in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X