Famiy: కొడుకు, కూతురిని చంపేసి తల్లి ఏం చేసిందంటే ?, తమ్ముడి ఇంటిలో ఏం జరిగింది ? !
బెంగళూరు/తుమకూరు: వివాహం చేసుకున్న మహిళ సంతోషంగా జీవిస్తోంది. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి హ్యాపీగా ఉండేది. పుట్టింటి దగ్గర పని ఉందని భర్తకు చెప్పిన మహిళ ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. తమ్ముడి ఇంటిలో ఉన్న మహిళ అంగడికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లి ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసి ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలుకాలోని కవణదాలద ప్రాంతంలో పుష్పలతా (30) అనే మహిళ ఉండేది. వివాహం చేసుకున్న పుష్పలతాకు హేమలతా అలియాస్ హేమా (9), శేఖర్ (7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పుష్పలతా ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరు సిటీలో నివాసం ఉంటున్నది.

మూడు రోజుల క్రితం పుట్టింటి దగ్గర పని ఉందని భర్తకు చెప్పిన పుష్పలతా ఆమె పిల్లలతో కలిసి తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలుకాలోని పుట్టింటికి వెళ్లింది. మూడు రోజుల నుంచి పుష్పలతా ఆమె బంధువులు అందరితో చాలా సంతోషంగా గడిపింది. తల్లి పుష్పలతాతో పాటు ఆమె పిల్లలు సాటి పిల్లలతో కలిసి సంతోషంగా గడిపారు.
అంగడికి వెళ్లి కొన్ని వస్తులు తీసుకుని వస్తామని తమ్ముడికి చెప్పిన పుష్పలతా ఆమె కూతురు హేమా, కుమారుడు శేఖర్ ను పిలుచుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తరువాత ఊరి సమీపంలో కుమార్తె, కుమారుడిని చెరువులో తోసేసిన పుష్పలతా తరువాత ఆమె కూడా అదే చెరువలో దూకి ఆత్మహత్య చేసుకుంది, ఇద్దరు బిడ్డలను చంపి పుష్పలతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అని కచ్యితంగా తెలియడంలేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications