చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రముఖ గాయని వాణీ జయరాం కన్నుమూత... అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వాణీ జయరాం

ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు.

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని నివాసంలో వాణీ జయరాంను చనిపోయిన స్థితిలో గుర్తించినట్లు థౌజండ్ లైట్స్ పోలీసు అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికిగానూ ఆమెకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.

ఈ అవార్డును అందుకోకముందే ఆమె మృతి చెందారు.

చెన్నైలోని నుంగంబాక్కంలోని తన ఇంట్లో పడిపోవడంతో వాణీ జయరామ్ మరణించినట్లు ఆమె స్నేహితులు తెలిపారు.

https://twitter.com/ANI/status/1621801535050219523

19 భాషల్లో 10 వేలకు పైగా పాటలు

వాణీ జయరాం 1945లో తమిళనాడులోని వేలూరులో జన్మించారు.

దాదాపు 5 దశాబ్దాల పాటు తన స్వరంతో ప్రేక్షకులను అలరించారు.

సినిమా పాటలతో పాటు భక్తి గీతాలు, ప్రైవేట్ ఆల్బమ్స్‌లోనూ ఎన్నో పాటలు పాడారు.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ సహా 19 భాషల్లో పదివేలకు పైగా పాటలను ఆమె పాడారు.

అయిదేళ్ల వయస్సులో కడలూరి శ్రీనివాస్ అయ్యంగార్ వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు.

పదేళ్ల వయస్సులోనే తొలిసారి ఆలిండియా రేడియాలో పాటలు పాడారు.

1970లో గుడ్డీ చిత్రంతో ఆమె గాయనిగా పరిచయం అయ్యారు. 'అభిమానవంతుడు’ సినిమాతో ఆమె తెలుగు సినిమాలో అరంగేంట్రం చేశారు.

అపూర్వ రాగంగళ్ , శంకరాభరణం, స్వాతికిరణం చిత్రాల్లో పాడిన పాటలకు ఆమె జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

స్వాతికిరణం సినిమాలోని "ఆనతినీయరా హరా" పాట ఆమెకు ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది.

వాణీ జయరాం

ఒంటరిగా నివాసం

చెన్నైలోని నివాసంలో వాణీ జయరామ్ ఒంటరిగా నివసిస్తున్నారు. ఆ ఇంట్లోనే ఆమె చనిపోయారు. పోలీసులు ఆమె ఇంటికి చేరుకొని తనిఖీలు చేశారు.

ఆమె మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

https://twitter.com/ANI/status/1621803898905436160

''అయిదు సార్లు బెల్ కొట్టినా ఆమె తలుపు తెరవలేదు’’

ఇంటి కాలింగ్ బెల్‌ను అయిదుసార్లు కొట్టినప్పటికీ ఆమె తలుపు తెరవలేదని వాణీ జయరామ్ ఇంట్లో పని చేసే మలర్కొడి చెప్పారు.

తన భర్త కూడా వాణీ జయరామ్‌కు ఫోన్ చేశారని, ఫోన్ కూడా ఎత్తలేదని మలర్కొడి తెలిపారు.

చెన్నైలోని నివాసంలో వాణీ జయరామ్ ఒక్కరే ఉంటారని ఆమె వెల్లడించారు.

''10.45కు ఆమె ఇంటికి వచ్చాను. బెల్ కొట్టాను, తలుపు తీయలేదు. నాలుగైదు సార్లు కొట్టినా తీయకపోవడంతో నాకు సందేహం వచ్చింది.

మా ఆయనకు ఫోన్ చేసి మీరు ఫోన్ చేసి చూడండి అని చెప్పాను. ఆయన కూడా ఫోన్ చేస్తే తీయలేదు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాం.

ఇంట్లో కింద పడిపోయి కనిపించారు. తలకు దెబ్బ కనిపించింది. నుదురు మీద దెబ్బ ఉంది. నేను ఆమె దగ్గర పదేళ్లుగా పనిచేస్తున్నాను.

నేను ప్రతీరోజూ 10.15కు వచ్చి 12 వరకూ ఉంటాను. అనారోగ్యం కూడా ఏమీ లేదు. చాలా బాగున్నారు. పద్మభూషణ్ అవార్డు రావడంతో చాలామంది వచ్చిపోతున్నారు. చాలా ఫోన్లు వస్తుంటే మాట్లాడుతుంటారు. బాగానే ఉన్నారు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటున్నారు’’ అని ఆమె వివరించారు.

https://twitter.com/ANI/status/1621811926744600577

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Famous singer Vani Jayaram's death... Police have registered a case of suspicious death
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X