బీహార్ లో అనూహ్య ఘటన- రాహుల్ కు ముద్దు..! ర్యాలీలో కలకలం..!

బీహార్ లో ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పేరుతో 65 లక్షల ఓట్లు తొలగించడానికి నిరసనగా లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ ర్యాలీ కొనసాగుతోంది. ఇవాళ ఈ ర్యాలీ సందర్భంగా రాహుల్ గాంధీ బైక్ యాత్ర చేపట్టారు. బైక్ పై హెల్మెట్ పెట్టుకుని రాహుల్ గాంధీ బీహార్ వీధుల్లో దూసుకుపోతుండగా.. ఆయనతో పాటు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ కూడా మరో బైక్ పై ప్రయాణించారు. ఈ సమయంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

బీహార్ లోని పూర్ణియా జిల్లాలో ఉన్న అరారియాలో ఇవాళ రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ మొదట్లో బాగానే సాగింది. అ తర్వాత రాహుల్ ర్యాలీలోకి కాంగ్రెస్, ఆర్జేడీ కార్యకర్తలు దూసుకురావడం ప్రారంభించారు. ఆ సమయంలో ర్యాలీ మధ్యలోకి వచ్చిన ఓ వ్యక్తి రాహుల్ గాంధీ బైక్ వద్దకు సమీపించి అతనికి ముద్దుపెట్టి కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే రాహుల్ భద్రతా సిబ్బంది అతన్ని పక్కకి లాగేశారు. దీంతో ర్యాలీలో కలకలం రేగింది. ఆ తర్వాత సజావుగానే సాగింది.

Fan Breaches Security to Kiss Rahul Gandhi Amidst Voter Adhikar Yatra in Bihar

అయితే రాహుల్ కు ముద్దుపెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిని గుర్తించినా వెంటనే పట్టుకోలేదు. దీంతో అతను పక్కకు వెళ్లిపోవడం కనిపించింది. ఈ ఘటన రాహుల్ గాంధీ భద్రతా ఉల్లంఘనలకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలు ఆరోపించాయి. సోషల్ మీడియాలో సైతం నెటిజన్లు రాహుల్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. గతంలో రాహుల్ తండ్రి రాజీవ్ తో పాటు నానమ్మ ఇందిరాగాంధీ సైతం హత్యలకు గురైన అంశాన్ని సైతం తెరపైకి తెస్తున్నారు.

Fan Breaches Security to Kiss Rahul Gandhi Amidst Voter Adhikar Yatra in Bihar

ఆగస్టు 17న బీహార్ లోని ససారాం నుంచి రాహుల్ గాంధీ తన ఓటర్ అధికార్ యాత్రను ప్రారంభించారు. 1300 కిలోమీటర్ల యాత్రను 16 రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఈ యాత్రకు ప్రతీ చోటా భారీ మద్దతు లభిస్తోంది. భారీ ఎత్తున కాంగ్రెస్, ఆర్జేడీ శ్రేణులు తరలివచ్చి రాహుల్ యాత్రకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ తమ ఇండియా కూటమి తరఫున కాబోయే ప్రధాని అని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ప్రకటించారు. దీనికి ఇండియా కూటమిలో ఇతరుల నుంచి వ్యతిరేకత కూడా రాకపోవడం ఆయనకు పెరుగుతున్న మద్దతుకు నిదర్శనమని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+