అర్ధరాత్రి వరకూ సాగిన చర్చలు విఫలం: మహా ర్యాలీ యధాతథం: ట్రాఫిక్ అడ్వైజరీ జారీ..!!
Farmers' protest 2024: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరోసారి ఉత్తరాది రైతులు ఉద్యమించనున్నారు. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు.
2021లో రైతుల ఆందోళన రోజుల తరబడి సాగిన విషయం తెలిసిందే. దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన దీక్షలను కొనసాగించారు. ఏడాది కాలం పాటు వారంతా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలను కొనసాగించారు. ఇప్పుడు మరోసారి రోడ్డెక్కడానికి సిద్ధపడ్డారు. ఈ నెల 13వ తేదీన ఛలో ఢిల్లీ ఆందోళనకు పిలుపునిచ్చారు.
కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా.. వంటి 200లకు పైగా రైతు సంఘాలు ఈ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ఛలో ఢిల్లీ ఆందోళనలో మూడు లక్షల మంది వరకు రైతులు పాల్గొనే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.

పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్.. వంటి రాష్ట్రాల నుంచి 500లకు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీకి తరలి వెళ్లనున్నారు రైతులు. దీనికోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పించడంతో పాటు గతంలో తాము ప్రతిపాదించిన తమ డిమాండ్లను పరిష్కరించాలని పట్టుబట్టుతున్నారు.
ఈ మహా ర్యాలీని ఉపసంహరించుకునేలా చేయడానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, నిత్యానంద రాయ్, అర్జున్ ముండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రైతు సంఘాల నాయకులతో వారు సోమవారం అర్ధరాత్రి వరకూ చర్చలు జరిపారు. అవేవీ కొలిక్కి రాలేదు. అర్ధాంతరంగా ముగిశాయి.
ఈ చర్చలు ముగిసిన అనంతరం కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు శర్వాణ్ సింగ్ పంధేర్ విలేకరులతో మాట్లాడారు. తాము ప్రతిపాదించిన డిమాండ్లకు మంత్రుల నుంచి సానుకూల స్పందన రాలేదని అన్నారు. తమ ఉద్యమాన్ని యధాతథంమగా నిర్వహించబోతోన్నామని తెలిపారు.

మంగళవారం ఉదయం 10 గంటలకు భారీ ప్రదర్శనగా ఢిల్లీకి తరలి వెళ్తామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమాన్ని విరమింపజేసే ఆలోచన కేంద్రం చేయట్లేదని ఆయన ఆరోపించారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలను కొనసాగించామని, తమ కనీస డిమాండ్లపై మంత్రులు దాటవేత ధోరణిని ప్రదర్శించారని చెప్పారు. దీనితో ఆందోళనను యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ ఆందోళనను దృష్టిలో ఉంచుకుని హర్యానా పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్లదలిచిన వారు పంచ్‌కుల-బర్వాల-సాహా, బరారా-బబైన్, లడ్వా-పిప్లి-కురుక్షేత్ర లేదా పంచ్‌కుల-బర్వాలా-యమునా నగర్-లాడ్వా-ఇంద్రి-కర్నాల్ మీదుగా మాత్రమే రాకపోకలు సాగించాలని సూచించారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications