ఎల్లుండి నిరాహార దీక్ష, కూలీలు, మహిళలు కలిసి రండి, కొనసాగుతోన్న రైతుల ఆందోళన..
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై భారతీయ కిసాన్ యూనియన్ ఆందోళన కొనసాగుతూనే ఉంది. రైతు నేతలపై డిమాండ్లపై కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో రైతు నేతలు కూడా తమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో వెంట ఆందోళనకు దిగారు. తమ కార్యాచరణకు ప్రకటించారు.
Recommended Video
ఆదివారం ఉదయం 11 గంటలకు రాజస్తాన్‌లోని షాజహన్ పూర్ వద్ద ట్రాక్టర్ ర్యాలీ తీస్తామని రైతు నేత కమల్ ప్రీత్ సింగ్ పన్ను తెలిపారు. ఇదీ ఢిల్లీ-జైపూర్ హైవేను దిగ్బందిస్తుందని తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. వ్యవసాయ చట్టాలకు సవరణలు చేయాల్సిందేనని.. రైతు నేతలు పట్టుబడుతున్నారు.

సోమవారం రోజున జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగుతామని చెప్పారు. తమతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దమయితే తాము కూడా రెడీ అని పేర్కొన్నారు. తమ ప్రధాన డిమాండ్ మాత్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు సవరణలు చేయడమేనని తెలిపారు. తమ నిరసనలకు కూలీలు, మహిళలు మద్దతు తెలుపాలని కూడా కోరారు.












Click it and Unblock the Notifications