ఛలో పార్లమెంట్.. వర్షకాల సమావేశాల్లో నిరసన: సంయుక్త్ కిసాన్ మోర్చా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో రైతు సంఘాలు మరోసారి కదం తొక్కకున్నాయి. రైతు వ్యతిరేక చట్టాలపై నిరసనకు సిద్దం అవుతున్నాయి. పార్లమెంట్ వెలుపల నిరసన తెలపుతామని సంయుక్త్ కిసాన్ మోర్చా తెలియజేసింది.
పార్లమెంట్ వర్షకాల సమావేశాలు సాగినన్నీ రోజులు వెలుపల నిరసన కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రతిపక్షాలకు కూడా సమాచారం అందజేశామని వివరించింది. జూలై 17వ తేదీన తమ సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని కోరామని తెలియజేశారు. ఒక్కో రైతు సంఘానికి చెందిన ఐదుగురు నేతలు పార్లమెంట్ బయట ఆందోళన చేపడుతారని నేత గుర్నామ్ సింగ్ తెలియజేశారు. మొత్తం రైతు సంఘాలు 40 వరకు ఉన్న సంగతి తెలిసిందే.

జూలై 8వ తేదీన పెట్రో ధరలను నిరసిస్తూ ఆందోళన చేపడుతామని సంయుక్త్ కిసాన్ మోర్చా ఇప్పటికే ప్రకటించింది. ఇటు కరోనా నేపథ్యంలో కోవిడ్ ప్రవర్తనా నియమావళి ప్రకారం సభా వ్యవహారాలను సాగించనున్నారు. సాధారణంగా వర్షాకాల సమావేశాలు జూలై మూడవ వారంలో ప్రారంభమై.. స్వాతంత్య్ర దినోత్సవం లోపు పూర్తి అవుతాయి. కనీసం ఒక డోసు కోవిడ్ టీకా తీసుకున్న వారిని పార్లమెంట్‌లోకి ఎంటరయ్యే అవకాశం కల్పిస్తారు.












Click it and Unblock the Notifications