మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం: 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. దీంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలనకు గురయ్యారు. ఈ క్రమంలో ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు రైలులో నుంచి కొందరు ప్రయాణికులు కిందకి దూకారు.
అయితే, అదే సమయంలో వారు దూకిన ట్రాక్‌పైకి బెంగళూరు ఎక్స్‌ప్రెస్ దూసుకురావడంతో 12 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో తీవ్రగాయాలపాయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని జల్‌గావ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పుష్పక్ ట్రైన్ చైన్ లాగడంతోనే మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.
UPDATE: ATLEAST 8 people dead ,more detail awaited #breaking #maharashtra #Jalgaon #pushpakexpress #bigbreaking #train #accident https://t.co/0lG6pSuLuP pic.twitter.com/dcpE9G9pii
— Ritesh Kumar (@riteshkumar1926) January 22, 2025
కాగా, అగ్ని ప్రమాదం పుకార్లు ఇంకా ధృవీకరించబడలేదని జల్గావ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. క్షతగాత్రుల కోసం మూడు ఆస్పత్రులను సిద్ధం చేశామన్నారు. అవసరమై అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. మృతులను గుర్తించి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అగ్ని ప్రమాదం అలారాన్ని తప్పుగా మోగించారనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ ప్రమాద ఘటనపై సెంట్రల్ రైల్వే స్పందించింది. ప్రయాణికులు చైన్ లాగగడంతో లక్నో-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు ఆగింది. దీంతో ఒక బోగి నుంచి కొందరు ప్రయాణికులు దిగారు. వారిని మరో ట్రాక్‌పై వెళుతున్న బెంగళూరు-ఢిల్లీ (కర్ణాటక ఎక్స్ ప్రెస్) రైలు ఢీకొంది. గాయపడివారిని ఆస్పత్రులకు తరలిస్తున్నామని సెంట్రల్ రైల్వే తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొంది.
కాగా, పుస్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఒక కోచ్‌లో హాట్ యాక్సిల్ లేదా బ్రేక్ బైండింగ్ కారణంగా నిప్పు రవ్వలు చెలరేగాయని ఓ అధికారి తెలిపారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురై చైన్ లాగారన్నారు. ఆ తర్వాత కొందరు బోగి నుంచి రైలు ట్రాక్ లపై దూకేశారని.. ఆ సమయంలో కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టిందని తెలిపారు. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సదరు అధికారి తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో 10-12 మంది మృతి చెందివుంటారని మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications