Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో వ్యక్తితో పెళ్లి, అన్నతో అక్రమ సంబంధం, కన్నతండ్రి ఏం చేశాడంటే?, ఏడు నెలలకు!

కాలేజీకి వెలుతున్న కూతురికి 17 ఏళ్లకే పెళ్లి చేశారు. తాను ప్రేమించిన వ్యక్తి తనకు కావాలని ఆ అమ్మాయి కుటుంబం ముందే డిమాండ్ పెట్టింది. తనకు నచ్చిన అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే హాయిగా ఉండాలనుకుంది. ప్రేమించిన వాడిని రెండో పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిన కూతురిని తండ్రి తీసుకెళ్లి చంపేశాడు. కూతురి శవానికి నిప్పంటించి కాల్చి బూడిద చేశాడు.

కూతురిని దారుణంగా హత్య చేసిన తర్వాత తన కూతురు కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే 7 నెలల తర్వాత పరువు హత్య జరిగిందన్న నిజం బయటపడటంతో అందరూ హడలిపోయారు. కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో మరో పరువు హత్య జరిగింది. కన్న తండ్రే తన కూతురిని నరికి చంపి తగులబెట్టాడని పోలీసులు చెబుతున్నారు.

Father brutally murdered his daughter who insisted on remarrying her cousin who was married to another man

కూతురు అర్చితా (17)ని ఆమె తండ్రి రవి హత్య చేశాడు. అర్పితా హత్య కేసులో ఆమె తండ్రి రవి నిందితుడు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మళబాగిల్ లోని ఓ కాలేజ్ లో అర్పితా ఇంటర్ చదువుతోంది. మే 21వ తేదీన జరిగిన అర్పితా హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కోలారు జిల్లా ముల్‌బాగిలు తాలూకా ముష్టూరు గ్రామంలో (ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో) చోటుచేసుకుందని పోలీసులు అన్నారు.

ముస్టూరులో నివాసం ఉంటున్న రవికి అర్పితా అనే కూతురు ఉంది. పక్క ఊరిలో నివాసం ఉంటున్న వరుసకు అన్న అయ్యే యువకుడితో అర్పితా ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న రవి అతని కూతురు అర్పితా ప్రేమను వ్యతిరేకించాడు. మ్యాటర్ అందరికి తెలిస్తే పరువు పోతుందని అనుకున్న రవి అతని కూతురు అర్పితాకు వేరే పెళ్లి చెయ్యాలని అనుకున్నాడు.

నువ్వు ప్రేమించిన అబ్బాయి రిలేషన్‌షిప్‌లో నీకు అన్నయ్య అవుతాడని, అతను, నువ్వు పెళ్లి చేసుకోకూడదని రవి అతని కుమార్తె అర్పితాకు సలహా ఇచ్చాడు. అయితే అర్పితా మాత్రం ప్రేమించి అబ్బాయితో అక్రమ సంబంధం కొనసాగించింది. అయితే కూతురు మైనర్ అయినప్పటికీ ఆమె అన్నతో పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని అనుకున్న రవి ఇదే ఏడాది మార్చి నెలలో వేరొకరితో అర్పితా వివాహం జరిపించాడు.

పెళ్లయ్యాక కూడా అర్పితా ఆమె భర్తను సరిగ్గా చూసుకోలేదు. బలవంతంగా పెళ్లి చేసుకున్న వ్యక్తితో అర్పితా సక్రమంగా కాపురం చెయ్యలేదు. దీంతో అల్లుడు వచ్చి కూతురుపై ఆమె తండ్రి రవికి ఫిర్యాదు చేశాడు. అప్పుడు రవి తన కుమార్తె అర్పితాకు బుద్ధి చెప్పి పంపిస్తానని అల్లుడికి, అతని కుటుంబ సభ్యులకు చెప్పి అతని స్వగ్రామం ముస్టూరుకు తీసుకువచ్చాడు. ఊరికి వెళ్లిన అర్పితా ప్రియుడితో శారీరక సంబంధం కొనసాగించింది.

Father brutally murdered his daughter who insisted on remarrying her cousin who was married to another man

కూతురు అర్పితాను ఇంటికి తీసుకెళ్ళి సలహా ఇచ్చినా ఆమె మాత్రం తండ్రి మాట వినకుండా నేను ప్రేమించిన వ్యక్తి తనకు కావాలని పట్టుబట్టింది. దీంతో ఆగ్రహించిన తండ్రి రవి సహనం కోల్పోయి కూతురు అర్పితా మీద ఇనుపరాడ్ తో దాడి చేసి ఆమెను హత్య చేశాడు. హత్యానంతరం తన కూతురు అర్పితా శవాన్ని వేరొకరి భూమిలోకి తీసుకెళ్లి తగులబెట్టాడు.

అయితే గ్రామంలోని కొంతమందికి భయపడిన రవి తన కూతురు కనిపించడం లేదంటూ అక్టోబర్ 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని నంగలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసుల విచారణలో అర్పితా హత్య కేసు బయటపడింది. ప్రస్తుతం నిందితుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్‌ఎస్‌ఐఎల్ బృందం కుమార్తె అర్పితా దగ్ధమైన ప్రదేశంలో మృతురాలి అవశేషాల కోసం వెతికి ఆధారాలు సేకరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+