ఆస్తి కోసం తండ్రిని కొట్టి చంపిన కొడుకు వీడియో వైరల్.. మంటగలిసిన మానవత్వం
సమాజంలో రోజురోజుకీ మానవత్వం మంటగలిసిపోతుంది. మానవ సంబంధాలకు, అనుబంధాలకు అర్థం లేకుండా పోతుంది. నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లిదండ్రులనే పిల్లలు చూడని, ఆస్తుల కోసం రకరకాలుగా వేధిస్తున్న అనేక ఘటనలు ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్నాయి తాజాగా తమిళనాడులోని పెరంబళూర్ లో కన్నతండ్రిని విచక్షణారహితంగా కొట్టి తండ్రి చావుకు కారణమైన ఒక కొడుకు తండ్రిపై చేసిన దాడి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆస్తి వివాదంలో తండ్రిని కొట్టిన తనయుడు
ఆస్తికి సంబంధించి కొడుకుకు తండ్రితో చోటు చేసుకున్న వివాదం అతనిని మానవ మృగంలా మార్చేసింది. ఆస్తికి సంబంధించిన గొడవలో కన్న తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసిన కుమారుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తమిళనాడులోని పెరంబళూర్ లో ఒక ప్రైవేటు కంపెనీ యజమాని అయిన 65 ఏళ్ల కులందైవేలు ఇంట్లో సోఫా పై కూర్చుని ఉండగావివాడంలోప్ ఆస్తి వివాదంలో కొడుకు సంతోష్ ఆయన ముఖంపై పిడి గుద్దులు గుద్దాడు.

కొడుకు కొట్టిన దెబ్బలకు తండ్రి మృతి
దీంతో రక్తం కారుతూ ఆయన అలాగే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత కూడా తండ్రి పై ఆగ్రహం చల్లారని కొడుకు మళ్లీ తండ్రిని కాళ్లతో తన్నుతూ దాడి చేశాడు. కుటుంబ సభ్యులు అతనిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ, వారందరిని విడిపించుకుని మళ్ళీ మళ్ళీ తండ్రి పై దాడి చేశాడు సదరు కుమారుడు. కొడుకు దాడితో తీవ్ర గాయాలు పాలైన వృద్ధుడిని ఆసుపత్రిలో చేర్చగా ఈనెల 18వ తేదీ ఆయన మరణించారు.
क्या पता था इस बाप को जो उसका बेटा है वही उसकी जान लेने पर उतारू हो जायेगा।
— Shivam Yadav (@ShivamYadavjii) April 28, 2024
कुछ प्रॉपर्टी के चक्कर में इस व्यक्ति को अपने पिता को बेरहमी से पीटा जिसके बाद सदमे में उनकी मौत भी हो गई।
सच में कलयुग अपने पीक स्टेज पर है।https://t.co/uu1di0dWf1
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సంతోష్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు తండ్రిపై దాడి చేస్తున్న వీడియో వైరల్ కావడంతో దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కన్నతండ్రి అన్న కనికరం కూడా లేకుండా దాడి చేసిన కొడుకును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మానవత్వం మంటగలిసిపోయింది
తండ్రిపై ఏ విధంగా అయితే దాడి చేశాడో అదే విధంగా పోలీసులు కూడా కొడుకు ముఖంపై పిడిగుద్దులు గుద్దాలని పలువురు అంటున్నారు. ఏది ఏమైనా మానవత్వం మంట గలిసిపోయిందని, రక్త సంబంధాలకు కూడా అర్థం లేకుండా పోయిందని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications