Business: వ్యాపారంలో రూ. 1.50 కోట్లు తేడా, తండ్రికి ఎక్కడో కాలిపోయి కొడుకును సజీవదహనం చేసి !
బెంగళూరు: కోట్లలో ఫ్యాబ్రికేషన్ వ్యాపారం చేస్తున్న తండ్రి వ్యాపారలావాదేవీలు చూసుకోవడానికి పనివాళ్లతో పాటు కొడుకును పెట్టుకున్నాడు. తండ్రి చేస్తున్న వ్యాపారాన్ని కొడుకు చూసుకుంటున్నాడు. తండ్రి అందుబాటులో లేని సమయంలో వ్యాపార లావాదేవీలు చూస్తున్న కొడుకు తరువాత తండ్రికి లెక్కలు చూపిస్తున్నాడు. చాలకాలంగా తండ్రి కొడుకులు చక్కగా వ్యాపారం చేస్తూ వచ్చిన లాభాలు చూసుకుంటున్నారు. తన కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడని, లెక్కలు సక్రమంగా చెబుతున్నాడని తండ్రి అనుకున్నాడు. గత నెలలో ఏకంగా రూ. 1. 50 కోట్ల వరకు లెక్కల్లో తేడాలు వచ్చాయి. ఇదే విసయంలో తండ్రి కొడుకుల మద్య వాగ్వివాదం జరిగింది. నాకు వ్యాపారంలో లెక్కలు సక్రమంగా చెప్పకపోతే కన్న కొడుకు అని కూడా చూడను, చంపేస్తా అని తండ్రి అతని కొడుకును హెచ్చరించాడు. నీకు చేతనైదని నువ్వు చేసుకో, నేను చచ్చినా నీకు లెక్కలు చూపించను అని కొడుకు తేల్చి చెప్పాడు. అంతే తండ్రికి మండిపోయి ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీలో ఉపయోగించే టిన్నర్ కొడుకు మీద పోసి నిప్పంటించించేశాడు. ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన కొడుకు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. డబ్బుల కోసం తన తండ్రి తనకు నిప్పంటించాడని ఇప్పటికే కొడుకు పోలీసులకు స్టేట్ మెంట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

బెంగళూరులో వ్యాపారం
బెంగళూరు నగరంలోని చామరాజపేట్ లో సురేంద్ర (52) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సురేంద్రకు అర్పిత్ అనే కొడుకు ఉన్నాడు. బెంగళూరులో సురేంద్ర ఫ్యాబ్రికేషన్ వ్యాపారం చేస్తున్నాడు. కోట్లలో ఫ్యాబ్రికేషన్ వ్యాపారం చేస్తున్న సురేంద్ర వ్యాపారలావాదేవీలు చూసుకోవడానికి పనివాళ్లతో పాటు కొడుకు అర్పిత్ ను ఫ్యాక్టరీలో పెట్టుకున్నాడు.

వ్యాపారం లెక్కలు చక్కగా చూపిస్తున్న కొడుకు
తండ్రి సురేంద్ర చేస్తున్న ఫ్యాబ్రికేషన్ వ్యాపారాన్ని అతని కొడుకు అర్పిత్ ఇంతకాలం చూసుకుంటున్నాడు. తండ్రి సురేంద్ర అందుబాటులో లేని సమయంలో వ్యాపార లావాదేవీలు చూస్తున్న అర్పిత్ తరువాత అతని తండ్రికి లెక్కలు చూపిస్తున్నాడు. చాలకాలంగా తండ్రీకొడుకు సురేంద్ర, అర్పిత్ లు చక్కగా వ్యాపారం చేస్తూ వచ్చిన లాభాలు చూసుకుంటున్నారు.

ఒకేనెలలో రూ. 1.50 కోట్లు తేడా
గత మార్చి నెలలో ఏకంగా రూ. 1. 50 కోట్ల వరకు లెక్కల్లో తేడాలు వచ్చాయి. ఇదే విసయంలో తండ్రీ కొడుకుల మద్య వాగ్వివాదం జరిగింది. నాకు వ్యాపారంలో లెక్కలు సక్రమంగా చెప్పకపోతే కన్న కొడుకు అని కూడా చూడను, చంపేస్తా అని సురేంద్ర అతని కొడుకు అర్పిత్ ను హెచ్చరించాడు.

కొడుక్కి నిప్పంటించిన తండ్రి
నీకు చేతనైదని నువ్వు చేసుకో, నేను చచ్చినా నీకు లెక్కలు చూపించను అని అర్పిత్ తేల్చి చెప్పాడు. అంతే సురేంద్రకు మండిపోయి ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీలో ఉపయోగించే టిన్నర్ అతని కొడుకు అర్పిత్ మీద పోసి నిప్పంటించించేశాడు. తీవ్రగాయాలైన అర్పిత్ ను బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

స్టోరీ మొత్తం చెప్పిన కొడుకు
ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అర్పిత్ ప్రాణాలు గురువారం గాలిలో కలిసిపోయాయి. డబ్బుల కోసం తన తండ్రి సురేంద్ర తనకు నిప్పంటించాడని ఇప్పటికే కొడుకు అర్పిత్ పోలీసులకు స్టేట్ మెంట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అర్పిత్ కు అతని తండ్రి సురేంద్ర నిప్పంటిస్తున్న సమయంలో సమీపంలోని సీసీటీవీల్లో రికార్డు అయ్యిందని, ప్రత్యక్షసాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు సురేంద్రను అరెస్టు చేశామని చామరాజపేట్ పోలీసులు తెలిపారు.