Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రేమించిందని కూతురిపై తండ్రి రేప్.. తల్లి సహకారం: విలువలు మరచిన కలికాలం

మానవత్వం మంటగలిసింది . కన్నతండ్రే కాలయముడై కూతురి మానంతో ఆడుకున్నాడు. ప్రాణంగా బిడ్డని కాపాడే తల్లి అందుకు సహకరించింది. ఇదంతా ప్రేమించినందుకు శిక్షగా ప్రేమ పర్యవసానంగా చెప్తున్నా పేగు తెంచుకు పుట్టిన ప్రేమ బంధాన్ని , బిడ్డను కాపాడాల్సిన బాధ్యతను మరచిన ఇద్దరు తల్లిదండ్రుల అకృత్యానికి నిదర్శనం ఈ దారుణం. మానవ సమాజ వికృత పోకడలకు సాక్ష్యం ఈ ఉదంతం .

మధ్యప్రదేశ్ లో దారుణం ... కూతురిపై తల్లిదండ్రుల అకృత్యం

మధ్యప్రదేశ్ లో దారుణం ... కూతురిపై తల్లిదండ్రుల అకృత్యం

మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లా తల్లిదండ్రులు ఒక కూతురిపై జరిపిన పాశవిక చర్యతో ఉలిక్కిపడింది. 45 ఏళ్ల తండ్రి తన కుమార్తెపై అత్యాచారం చేస్తుంటే , కూతురు అరవకుండా తల్లి నోట్లో గుడ్డలు కుక్కి ఆ పైశాచిక తండ్రికి సహకరించింది . స్థానిక యువకుడితో సంబంధం పెట్టుకున్నందుకు, ప్రేమలో పడినందుకు ఇది శిక్ష అని ఆ తల్లిదండ్రులు చేసిన దాష్టీకం సభ్య సమాజాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేసింది.

ప్రేమకు శిక్షగా తండ్రి అత్యాచారం

ప్రేమకు శిక్షగా తండ్రి అత్యాచారం

స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్ గా పని చేసి రిటైర్ అయిన ఓ మానవ మృగం తన భార్యతో కలిసి ఓ యువకుడితో ప్రేమలో పడిందన్న కారణంగా చెయ్యకూడని పని చేశాడు . ముగ్గురు కుమార్తెలలో చిన్న కూతురు అయిన 18 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడితే బుద్ధి చెప్పి కూతురిని మందలించి మార్చాల్సింది పోయి అఘాయిత్యానికి పదేపదే పాల్పడటంతో ఆ యువతీ తన సోదరికి చెప్పి బోరున విలపించింది .

అత్యాచారం చేసిన తండ్రికి సహకరించిన తల్లి

అత్యాచారం చేసిన తండ్రికి సహకరించిన తల్లి

కరోనా లాక్డౌన్ అయిన 16 రోజుల్లో ఆమె తన తండ్రి చేత రెండుసార్లు అత్యాచారం చేయబడిందని ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అవినాష్ బన్సాల్ చెప్పారు. ప్రాథమిక విచారణ తర్వాత పోలీసులు నిందితుడిని, అతని భార్యను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మార్చి 26 న మధ్యాహ్నం 2 గంటలకు వంటగదిలో పనిచేస్తుండగా కుమార్తెను ఆమె తండ్రి పట్టుకున్నాడు. అప్పుడు ఆమెను బలవంతంగా మంచానికి కట్టేసి అత్యాచారం చేస్తుంటే , తల్లి ఆమె అరవకుండా నోటిలో గుడ్డలు కుక్కిందని చెప్పారు. ఇలా చేస్తే బుద్ధి వస్తుందని, ప్రేమకి శిక్ష అని భావించి చేసినట్టు పేర్కొన్నారు .

రెండుసార్లు కూతురిపై దారుణం .. కేసు నమోదు

రెండుసార్లు కూతురిపై దారుణం .. కేసు నమోదు

ఇక మరోమారు ఏప్రిల్ 10న ఆ యువతి ఇంట్లో సూటిపోటి మాటలు, వేధింపులు భరించలేక దగ్గరల్లో ఉన్న ఆంటీ వాళ్ల ఇంటికి వెళ్లి తలదాచుకుంది. ఆ విషయం తెలుసుకున్న తండ్రి కూతుర్ని లాక్కొచ్చి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక తనపై జరుగుతోన్న దారుణాన్ని బాధితురాలు పెద్దక్కకు చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అక్క పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులను గట్టిగా మందలించి చెల్లిని తనతో తీసుకెళ్లిపోయింది. అంతే కాదు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+