పెళ్లిని దాచి మహిళ ఫేస్‌బుక్ ప్రేమ: కాల్చేసిన ప్రియుడు

FB lover kills woman after meet
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఫేస్‌బుక్ ప్రేమ విషాదాంతమైంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై తనను చీట్ చేసిందని గుర్తించిన యువకుడు ఆ మహిళను చంపేశాడు. అనంతరం అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషాధ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోలో జరిగింది.

వయసు, పెళ్లి తదితర వివరాలు దాచిందన్న కోపంతో ప్రియుడు వినీత్ సింగ్ (22) ప్రియురాలు జ్యోతి కోరీ (44)ని కాల్చి చంపాడు. అటుపైన ఆవేదన భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ వాసి వినీత్ సింగ్‌కు ఫేస్‌బుక్‌లో జ్యోతి కోరీ పరిచయమైంది.

సరదాగా మొదలైన పరిచయం ప్రేమగా మారింది. రెండున్నరేళ్లపాటు వారు ప్రేమించుకుంటున్నారు. వినీత్ ఎప్పటికప్పుడు తన ఫొటోలను, వివరాలను అప్‌లోడ్ చేసేవాడు. జ్యోతి తన ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టలేదు. అంతేకాదు తాను వివాహితురాలినని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని ప్రియుడికి చెప్పలేదు.

ఈ నేపథ్యంలో ఈ నెల 18న తొలిసారి ప్రేమికులిద్దరూ జబల్‌పూర్‌లోని నర్మద నదీతీరంలో కలిశాడు. అప్పుడు అతనినికి నిజం తెలిసింది. ఆమెతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇన్నేళ్లూ ఇదంతా ఎందుకు దాచావని ఆవేశంతో ప్రశ్నించాుడ.

హఠాత్తుగా జ్యోతి కోరిని తుపాకీతో రెండుసార్లు కాల్చేశాడు. తర్వాత పశ్చాత్తాపానికి లోనై తనను తాను కాల్చుకున్నాడు. అయితే, అక్కడున్న వారు వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారించారు. దీంతో విషయం బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+