చిత్ర హింసలు: హిందూ మతం స్వీకరించిన ముస్లీం న్యాయవాది, ఆయన చేసిన తప్పు అదే !
ముస్లీం మతానికి చెందిన సీనియర్ న్యాయవాది కుటుంబ సభ్యులను చుట్టుపక్కల నివాసం ఉంటున్న అదే మతం వారు వేధింపులకు గురి చేసి సూటి పోటి మాటలు మాట్లాడటంతో హిందూ మతం స్వీకరించిన ఘటన బీహార్ లోని బెగుసరాయ్ జిల్లా
పాట్నా: ముస్లీం మతానికి చెందిన సీనియర్ న్యాయవాది కుటుంబ సభ్యులను చుట్టుపక్కల నివాసం ఉంటున్న అదే మతం వారు వేధింపులకు గురి చేసి సూటి పోటి మాటలు మాట్లాడటంతో హిందూ మతం స్వీకరించిన ఘటన బీహార్ లోని బెగుసరాయ్ జిల్లాలో జరిగింది.
న్యాయవాది మహమ్మద్ అన్వర్ (46), ఆయన కుమారులు మహమ్మద్ అమీర్ (11), మహమ్మద్ షబీర్ (9) అనే ముగ్గురు చట్టం ప్రకారం హిందూ ధర్మం స్వీకరించారు. ఇప్పుడు న్యాయవాది మహమ్మద్ అన్వర్ తన పేరును ఆనంద్ భారతీ గా మార్చుకున్నారు.

కుమారులు సైతం !
ఆయన కుమారులు మహమ్మద్ అమీర్ పేరు అమన్ భారతి, మరో కుమారుడు మహమ్మద్ షబీర్ పేరు సుమన్ భారతీగా మారిపోయింది. తాము ఎలాంటి ఒత్తిడికి తల వంచకుండా మనస్పూర్థిగా హిందూ మతం స్వీకరించామని న్యాయవాది మహమ్మద్ అన్వర్ అలియాస్ ఆనంద భారతి అంటున్నారు.

హిందూ దేవుళ్లకు పూజలు
న్యాయవాది మహమ్మద్ అన్వర్ కుటుంబ సభ్యులు ఇంటిలో అల్లాతో పాటు హిందూ మతానికి చెందిన దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. మసీద్ తో సహ అన్ని హిందూ దేవాలయాలకు వెలుతున్నారు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న ముస్లీంలకు ఈ విషయం తెలిసింది.

చెప్పింది విను లేదంటే !
వెంటనే నువ్వు, నీ కుటుంబ సభ్యులు ఇస్లాం మతం వదిలి పెట్టాలని సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని న్యాయవాది మహమ్మద్ అన్వర్ ఆరోపించారు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారి చిత్ర హింసలు రోజురోజుకు పెరిగిపోయాయని మహమ్మద్ అన్వర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారి అభయంతోనే !
చివరికి తాను విధిలేక భజరంగ్ ధళ్ కార్యకర్తలను కలుసుకున్నానని చెప్పారు. హిందూ ధర్మం స్వీకరించినా మీరు మసీదుకు వెళ్లవచ్చని, మీకు ఎలాంటి సమస్యలు రావని భజరంగ్ దళ్ కార్యకర్తలు సూచించారని, అందుకే హిందూ మతం స్వీకరించానని మహమ్మద్ అన్వర్ అంటున్నారు.

న్యాయవాది భార్య మాత్రం !
మహమ్మద్ అన్వర్ అలియాస్ ఆనంద్ భారతీ కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని భజరంగ్ దళ్ కార్యాకర్తలు అంటున్నారు. అయితే మహమ్మద్ అన్వర్ అలియాస్ ఆనంద భారతీ భార్య షబనమ్ మాత్రం ఇంకా హిందూ మతం స్వీకరించలేదని ఓ జాతీయ ఆంగ్ల దిన పత్రిక కథనం ప్రచురించింది.












Click it and Unblock the Notifications