Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు.. సింహం సింగిల్ గానే - విజయ్

సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో లేదా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు మధురైలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై తన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు. తాను మధురై ఈస్ట్, మధురై సౌత్, ఉసిలంపట్టి, మెల్లూర్ - మొత్తం మధురై నుంచి పోటీ చేస్తున్నానని వ్యాఖ్యానించారు. అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తానని.. 234 స్థానాల నుండి పోటీ చేస్తామని విజయ్ తెలిపారు.

ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మద్దతుదారులు భారీఎత్తున హాజరయ్యారు. పార్టీ స్థాపించిన తర్వాత ఏర్పాటు చేసిన రెండో పెద్ద రాష్ట్ర స్థాయి సమావేశం ఇదే కావడం గమనార్హం. ముఖ్యంగా తన రాజకీయం గురించి వివరిస్తూ విజయ్ ఉపమానాలు వాడారు. "సింహం ఒకటే ఉంటుంది. అది గర్జించినప్పుడు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు ప్రతిధ్వనిస్తుంది. నక్కలు ఎన్నో ఉన్నా రాజు మాత్రం సింహమే" అని అన్నారు. ఇది తన పార్టీ ప్రత్యేకతను సూచిస్తుందని వ్యాఖ్యానించారు. 2026లో టీవీకే పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని పరోక్షంగా సూచించారు.

film-actor-and-tvk-president-vijay-made-sensational-comments

బీజేపీ - భావజాల శత్రువు, డీఎంకే - రాజకీయ శత్రువు

విజయ్ మాట్లాడుతూ.. బీజేపీ మన భావజాల శత్రువు, డీఎంకే మన రాజకీయ శత్రువు అని స్పష్టంగా ప్రకటించారు. టీవీకే పార్టీ ఎవరికీ భయపడదని, అవినీతి గుంపుల కింద నడిచే సంస్థ కాదని ఆయన స్పష్టం చేశారు. ఫాసిస్ట్ బీజేపీని, విషపూరిత డీఎంకేను ఎదుర్కోవడానికి తమిళులు సిద్ధంగా ఉన్నారని ఆయన పిలుపునిచ్చారు. ఏ బానిస పొత్తులోనూ చేరాల్సిన అవసరం లేదని.. తమ పొత్తు స్వార్థపూరితం కాదని.. ఆత్మగౌరవంతో కూడినది అవుతుందని అన్నారు.

అలానే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విజయ్ విరుచుకుపడ్డారు. కచ్చతీవు దీవిని తమిళ మత్స్యకారులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని మరోసారి స్పష్టం చేశారు. మత్స్యకారుల అరెస్టులు సహా పలు అంశాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

డీఎంకే పాలనపై విమర్శలు..

స్టాలిన్ అంకుల్.. మహిళలకు రూ.1,000 ఇస్తే సరిపోతుందా? ఏడుస్తున్న ఆ మహిళల శబ్దాలు మీకు వినిపిస్తున్నాయా? రైతులు, మత్స్యకారులు మోసపోతున్నారు. మీరు చాలా తప్పు చేస్తున్నారు" అని ఆయన ఘాటుగా విమర్శించారు. అంతే కాకుండా ఎంజీఆర్ మరణానంతరం తొలిసారిగా అన్నాడీఎంకేను విజయ్ బహిరంగంగా విమర్శించారు. ఎంజీఆర్ స్థాపించిన పార్టీని ఎవరు రక్షిస్తున్నారు? ఇప్పుడు పార్టీ ఏ స్థితిలో ఉంది అనేది చెప్పనవసరం లేదు అని అన్నారు.

ఒక రాజకీయ నాయకుడు నిజాయితీగా ఉన్నాడా అనేదే ముఖ్యం. అతను నటుడా కాదా అనేది పెద్ద విషయం కాదు. రాజకీయ నాయకులందరూ తెలివైన వారు కాదు, నటులందరూ వెర్రివారు కాదు" అని విజయ్ స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణం ప్రారంభం నుండి ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకున్న విజయ్, ప్రజల కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. నాకు వేరే పని లేదు.. ప్రజలే నా శక్తి.. నేను ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడతాను అని విజయ్ బహిరంగ సభలో స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+